బంగారు తెలంగాణ.. మా రాష్ట్రానికి ఎటువంటి సమస్యలు లేవు.. మా ప్రజలందరు సంతోషంగా ఉన్నరంటూ చెప్పుకుంటున్న బీఆర్ఎస్ మంత్రులు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ఉద్యోగ.. నిరుద్యోగుల ఆత్మహత్యాలు మాత్రం ఆపలేకపోతున్నారు. నాలుగు రోజుల కిందట టైంకి జీతం పడలేదని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు రవీందర్ ఇవాళ మృతి చెందారు.
చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్లో హోంగార్డుగా విధుల నిర్వహిస్తున్న రవీందర్ ఈ నెల జీతం టైంకి అందక అధికారులను ప్రశ్నించగా.. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని.. ఒకట్రెండు రోజుల్లో బ్యాంక్ ఖాతాల్లోకి జీతం జమ అవుతుందని చెప్పిన ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు ఉండటంతో మనస్తాపానికి గురై.. గోషామహల్ హోంగార్డు హెడ్ ఆఫీసు ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 55 శాతం పైగా కాలిన గాయాలతో ఆయన తొలుత ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు. ఆపై పరిస్థితి విషమించడంతో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. ఇవాళ రవీందర్ మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.
మరోవైపు రవీందర్ భార్య మీడియాతో మాట్లాడుతూ.. తన భర్తపై కానిస్టేబుల్ చందు, ఏఏస్ఐ నర్సింగరావులు కలిసి పెట్రోల్ పోశారంటూ వాపోయింది. హోంగార్డ్ అఫీస్ సీసీటీవీ ఫుటేజీ చూస్తే తెలుస్తుందని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ వేడుకుంది. ఈ ఘటనపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హోంగార్డులకు కనీస ఆత్మగౌరవాన్ని కూడా ఇవ్వకుండా.. వేధిస్తున్న ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డులు తొందరపడొద్దని.. ఆత్మహత్యలే మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కాదని విజ్ఞప్తి చేశారు. పోరాడి సాధించుకుందాం తప్ప.. ఆత్మహత్యలు చేసుకొవద్దని సూచించారు.