ఇంగ్లిష్ మీడియం విషయంలో తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకుంది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు తన పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసి నట్టుగా సమాచారం. కామెడీ ఏమిటంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు తమ ఘనతే అని ప్రచారం చేయాలని చంద్రబాబు నాయుడు తన పార్టీ శ్రేణులకు ఆదేశించడం!
తమ హయాంలోనే అవి ప్రారంభం అయినట్టుగా ప్రచారం చేయాలని, ఆ క్రెడిట్ టీడీపీకే దక్కేలా ప్రచారం చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారట! నిన్నమొన్నటి వరకూ ఇంగ్లిష్ మీడియం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్లు, వారి పార్ట్ నర్ పవన్ కల్యాణ్.
ఇప్పుడేమో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువుల ఘనత తెలుగుదేశం పార్టీదే అని ప్రచారం చేస్తారట. ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలను తాము వ్యతిరేకిస్తే.. ఆర్థికంగా వెనుకబడి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపే వారిలో వ్యతిరేకత వస్తుందని చంద్రబాబుకు భయం పట్టుకుందట. అందుకే డొల్ల మాటలను ఆపేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్లినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ యూటర్న్ లో మరో అడుగు ముందుకు వేసి.. ఆ క్రెడిట్ తమదే అని టీడీపీ ప్రచారం చేసుకుంటుందట! జగన్ దెబ్బకు ఇప్పటికే చంద్రబాబుకు ఎన్నో యూటర్న్ లు తీసుకున్నారు. వాటితో రాజకీయంగా గట్టిగా దెబ్బలు తిన్నారు కూడా. ఇప్పటికే అదే కథే కొనసాగుతూ ఉండటం గమనార్హం!