ఔరౌరా.. పరిటాల శ్రీరామ్!

తాము ఆ ప్రాంతాన్ని తెగ ఉద్ధరించినట్టుగా, తమపై ఆ ప్రాంత ప్రజలు అందుకే విపరీతమైన ఆదరణను చూపిస్తారన్నట్టుగా ప్రకటించుకుంటూ వచ్చారు ఇన్నేళ్లూ. అయితే వారు రౌడీయిజం చేసి జనాలను వేధించారని, ప్రత్యర్థులను హతమొందించి రాజ్యం…

తాము ఆ ప్రాంతాన్ని తెగ ఉద్ధరించినట్టుగా, తమపై ఆ ప్రాంత ప్రజలు అందుకే విపరీతమైన ఆదరణను చూపిస్తారన్నట్టుగా ప్రకటించుకుంటూ వచ్చారు ఇన్నేళ్లూ. అయితే వారు రౌడీయిజం చేసి జనాలను వేధించారని, ప్రత్యర్థులను హతమొందించి రాజ్యం చేశారని ప్రత్యర్థులు ఆరోపిస్తూ వచ్చారు. ఇలాంటి క్రమంలో ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలోనే పరిటాల కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యేగా తొలి సారి పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్నాడు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గానికి దాదాపుగా మొహం చాటేశారు. అంతకన్నా కామెడీ ఏమిటంటే.. ఇప్పుడు నియోజకవర్గం ప్రజల మీద పరిటాల ఫ్యామిలీ ఆప్యాయతలు ఏ పాటివో బయటపడుతూ ఉన్నాయి.

ఎమ్మెల్యేగా తమను ఓడించారని వారు.. కొన్నాళ్ల కిందట తాము ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ లను విప్పేయిస్తూ ఉన్నారట. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి.పరిటాల ట్రస్టు ద్వారా అంటూ కొన్ని గ్రామాల్లో రెండు రూపాయలకే కొన్ని ప్యూరిఫైడ్ వాటర్ ను అందించే ప్రోగ్రామ్ ను అమలు చేశారు. అది కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నెగ్గిన తర్వాత. గవర్నమెంట్ ప్రోగ్రామ్ కు అనుసంధానించి ఆ వాటర్ ప్లాంట్స్ ను నడిపించారు. 

అయితే ఇటీవలి ఎన్నికల్లో జనాలు తమకు ఓటేయలేదని, పరిటాల రవి పేరుతో ట్రస్ట్ ద్వారా నిర్వహించిన వాటర్ ప్లాంట్స్ ను ఇప్పుడు విప్పేయించారట. వాటి ఎక్విప్ మెంట్ ను పరిటాల శ్రీరామ్ ఇంటికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇదీ పరిటాల కుటుంబానికి ఉన్న సేవాదృక్పథం!

ఎమ్మెల్యేగా ఓడించారని చెప్పి, ట్రస్టు పేరుతో తాము ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను కూడా విప్పేసి ఇళ్లకు తీసుకుపోయేంత సేవా మూర్తులు వీళ్లు అని రాప్తాడు జనాలు గొణుక్కుంటున్నారు!