బన్నీ కోసం..బన్నీ వలన..బన్టీ స్టయిల్ లో

అందరు హీరోల సంగతి ఎలా వున్నా, స్టయిలిష్ స్టార్ బన్నీకి కొన్ని ఇష్టాలు, అభిరుచులు వున్నాయి. అవి సినిమాలోని అతగాడి స్టయిల్ లో తొంగి చూస్తుంటాయి. నా పేరు సూర్యలో సిగార్ కాలుస్తూ, కనిపించే…

అందరు హీరోల సంగతి ఎలా వున్నా, స్టయిలిష్ స్టార్ బన్నీకి కొన్ని ఇష్టాలు, అభిరుచులు వున్నాయి. అవి సినిమాలోని అతగాడి స్టయిల్ లో తొంగి చూస్తుంటాయి. నా పేరు సూర్యలో సిగార్ కాలుస్తూ, కనిపించే గెటప్ డిజైన్ చేసుకున్నది బన్నీనే. లేటెస్ట్ గా అల వైకుంఠపురములో ర్యాప్ సాంగ్ కూడా బన్నీ అభిరుచి మేరకే చొప్పించక తప్పలేదని తెలుస్తోంది. 

సాధారణంగా ఇలాంటి ర్యాప్ సాంగ్స్ ను త్రివిక్రమ్ ఎంకరేజ్ చేయరు. ఆ పాట, దానికి డ్రెస్సింగ్ అంతా బన్నీ వ్యవహారమే అని తెలుస్తోంది. రెండు బ్లాక్ బస్టర్ పాటల తరువాత వచ్చిన ఈపాటకు మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. పాట లిరిక్స్ తో పాటు విడుదల చేసిన మేకింగ్ విడియో ప్రకారం పాట చిత్రీకరణ ఎలా వుండబోతోందో తెలుస్తోంది. ఇది త్రివిక్రమ్ స్టయిల్ ఎంత మాత్రం కాదు అని, ఆయన సినిమాలు ఫాలో అయ్యేవారు ఎవరైనా చెబుతారు.

అంటే బన్నీ అభిరుచి మేరకు, బన్నీ స్టయిల్ లో, బన్నీ కోసం 'ఓ మై డాడీ' పాటను తయారుచేయించుకున్నట్లు కనిపిస్తోంది. ఆ పాటలో పదాలు కూడా అలాగే వున్నాయి. త్రివిక్రమ్ అన్నాక కొంత స్టాండర్ట్, క్వాలిటీ ఆశించవచ్చు. ఈ పాటలో అవి వున్నాయి అని అనుకోవాల్సిందేమో కానీ, అనుమానమే.