cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్నేహం కోసం మెగాస్టార్

స్నేహం కోసం మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా ఫంక్షన్ కు రావడం అంటే, ఆ క్రేజ్, బజ్ మామూలుగా వుండదు. అయితే అలా రావాలి అంటే అంత వీజీకాదు. ఇంతకూ విషయం ఏమిటంటే, వచ్చేవారం విడుదల కాబోయే ఓ సినిమా ఫంక్షన్ కు మెగాస్టార్ రాబోతున్నారు అని తెలుస్తోంది.

టాగోర్ మధు-ఆకెళ్ల రాజ్ కుమార్ నిర్మించిన అర్జున్ సురవరం సినిమా బాలరిష్టాలు అన్నీ దాటుకుని వచ్చేవారం విడుదల కాబోతోంది. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఓ కీలకమైన వర్తమాన సామాజిక సమస్యను డిస్కస్ చేసారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు రావడానికి ఏమైనా అవకాశం వుంటుందా అని నిర్మాతలు మెగాస్టార్ ను కోరినట్లు తెలుస్తోంది.

దాంతో ముందుగా సినిమా చూస్తానని మెగాస్టార్ అడగడం, దాంతో వెంటనే ఆ మేరకు ఏర్పాట్లు చేయడం జరిగిపోయింది. సినిమా చూసి, మంచి సమస్యను డీల్ చేసి, మంచి మెసేజ్ ఇచ్చారని నిర్మాతలను ప్రశంసించి, ఫంక్షన్ కు వస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇటు టాగోర్ మధు అటు ఆకెళ్ల రాజ్ కుమార్ ఇద్దరూ మెగాస్టార్ తో మంచి స్నేహ సంబంధాలు వున్నవారే. అందుకే ప్రత్యేకంగా మెగాస్టార్ హాజరవుతారని తెలుస్తోంది.

 


×