ఆ రెండు డైలాగులు అందుకేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తయారవుతున్న సరిలేరునీకెవ్వరూ సినిమా టీజర్ బయటకు వచ్చింది. ఈ టీజర్ లో ఏం వుండబోతోందన్నది ముందుగానే ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించింది గ్రేట్ఆంధ్ర.…

సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తయారవుతున్న సరిలేరునీకెవ్వరూ సినిమా టీజర్ బయటకు వచ్చింది. ఈ టీజర్ లో ఏం వుండబోతోందన్నది ముందుగానే ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించింది గ్రేట్ఆంధ్ర. ఆ సంగతి అలా వుంచితే టీజర్ లో వేసిన రెండు డైలాగులు డిస్కషన్ పాయింట్ గా మారాయి.

సంక్రాంతికి బన్నీ-మహేష్ సినిమాలు పోటీ పడుతున్నాయి. సరిలేరు టీజర్ లో పడిన డైలాగులను ఈ పోటీ నేపథ్యంలో చూస్తున్నారు. ముందుగా బన్నీ సినిమా జనవరి 12న డేట్ ప్రకటించింది. మహేష్ సినిమా కూడా 12న డేట్ వేసింది ఆఖరికి సినిమా పెద్దలు రంగప్రవేశం చేసి 11,12 తేదీలకు సర్దుబాటు చేసారు.

టీజర్లో పడిన డైలాగు, భయపడిన వాడే బేరానికి వస్తాడు..ఇక్కడ బేరాలు లేవమ్మా…అన్న దాన్ని ఈ విడుదల డేట్ లకు లింక్ పెట్టి డిస్కస్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.

అలాగే పండగకు అల్లుడు వస్తాడనుకుంటే మొగుడు వచ్చాడు అనే డైలాగు కూడా ఇలాంటిదే అని టాక్. పండక్కి సరైన మొగుడు లాంటి సినిమా తమది అని అన్యాపదేశంగా చెప్పినట్లు అనిపిస్తోంది.

మొత్తం మీద ఈ సారి సంక్రాంతి సినిమాల మధ్య పోటీ రసవత్తరంగానే వుండేలా వుంది.