టీడీపీకి విశోకమేనా.. ?

విశాఖ అంటేనే కంచుకోట అని టీడీపీ తమ్ముళ్లు చెబుతూ తెగ సంబరపడతారు. అయితే అలాంటి కంచుకోటలో ఇపుడు వైసీపీ పాగా వేసింది. వరసబెట్టి విజయాలను సొంతం చేసుకుంటోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ సిటీలో…

విశాఖ అంటేనే కంచుకోట అని టీడీపీ తమ్ముళ్లు చెబుతూ తెగ సంబరపడతారు. అయితే అలాంటి కంచుకోటలో ఇపుడు వైసీపీ పాగా వేసింది. వరసబెట్టి విజయాలను సొంతం చేసుకుంటోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ సిటీలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఓడిన వైసీపీ ఆ తరువాత మాత్రం గట్టిగానే పట్టు బిగించింది.

విశాఖలో ఏ ఎన్నిక జరిగినా ఫ్యాన్ పార్టీదే విజయం అవుతోంది. ఇక విశాఖ మేయర్ సీటును సైతం తొలి ప్రయత్నంలోనే సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేసిన వైసీపీ తాజాగా జరిగిన రెండు కార్పోరేటర్ల ఉప ఎన్నికల్లోనూ అదే జోరుని చూపించి సక్సెస్ కొట్టేసింది.

విశాఖలోని 31వ వార్డు అంటే టీడీపీకి కంచుకోట లాంటి సీటు. అలాంటి చోట టీడీపీ కార్పోరేటర్ చనిపోయి ఉప ఎన్నిక వస్తే ఆ సానుభూతిని సైతం అధిగమించి వైసీపీ విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు.

ఇదిలా ఉంటే విశాఖలో అంతకంతకు వైసీపీ తన బలాన్ని పెంచుకుంటూంటే టీడీపీకి గట్టి నేతల కరవు వెంటాడుతోంది. ఒకపుడు విశాఖలో చక్రం తిప్పిన కీలక నేతలు సైడ్ కావడం వల్లనే ఇపుడు ఆ పార్టీ ఇబ్బందులు పడుతోంది అంటున్నారు. మొత్తానికి ఇదే సీన్ కొనసాగితే కచ్చితంగా టీడీపీ విశాఖ శోకమే మిగిలిస్తుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.