నిమ్మాడలో అచ్చెన్న…క్యాడర్ వైసీపీలోకి !

ఎట్టకేలకు మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన సొంత ఊరు నిమ్మాడకు చేరుకున్నారు. 88 రోజుల సుదీర్ఘ ప్రవాసం తరువాత ఆయన ఇంటి గడప తొక్కారు. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో ఇరుక్కుని అరెస్ట్ అయిన…

ఎట్టకేలకు మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన సొంత ఊరు నిమ్మాడకు చేరుకున్నారు. 88 రోజుల సుదీర్ఘ ప్రవాసం తరువాత ఆయన ఇంటి గడప తొక్కారు. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో ఇరుక్కుని అరెస్ట్ అయిన సంగతి విధితమే. ఈ మధ్యనే ఆయనకు బెయిల్ వచ్చింది. తిరుపతి, సింహాచలం దేవుళ్ల దర్శనం తరువాత అచ్చెన్న తన పుట్టింట కాలు మోపారు.

అయితే అచ్చెన్నాయుడు ఇంతకాలం కనబడకపోయేసరికి టీడీపీ క్యాడర్ చెల్లాచెదురైంది. అధికార  వైసీపీ దూకుడు రాజకీయం కూడా దానికి తోడు కావడంతో ఎక్కడి వారు అక్కడ అన్నట్లుగా ఫ్యాన్ నీడన సర్దుకున్నారట.

అరెస్ట్ కి ముందు కూడా అచ్చెన్నాయుడు పెద్దగా జనంలోకి వచ్చిన సందర్భాలు లేవంటున్నారు. కరోనా కారణంగా ఆయన గుమ్మం దాటలేదు. దానికంటే ముందు కూడా ఆయన విపక్ష ఎమ్మెల్యేగా తన పరిధి, పరిమితులకు లోబడి బాగానే తగ్గారని అంటారు.

ఉంటే అమరావతి, లేకుంటే నిమ్మాడ అన్నట్లుగా అచ్చెన్న రాజకీయం అప్పట్లో సాగింది. దాంతో క్యాడర్ ఆయన లేని వేళ చూసుకుని గోడ దూకేశారు. మొత్తానికి అచ్చెన్న అరెస్ట్ తో ఆయనకూ, క్యాడర్ కీ కూడా అయిన వారు ఎవరో తెలిసివచ్చిందని సెటైర్లు పడుతున్నాయి.

ఆ మానసిక దౌర్భల్యం తగ్గేలా లేదు