తెలంగాణ సిఎమ్ కేసిఆర్ కొత్త కేంద్ర పార్టీ పెడుతున్నారని, భాజపాకు సవాల్ గా నిలవబోతున్నారని ఈ రోజు ఓ మీడియాలో వార్త గుప్పు మంది. నిజానికి మెడమీద తలకాయ వున్నవాడు ఎవ్వరూ ఇది నమ్మరు. ఎందుకంటే ఇక్కడ కీలకమైన కొన్ని పాయింట్లు వున్నాయి.
అసలు కేసిఆర్ కు ఆల్రెడీ ఓ పార్టీ వుంది. ఇదేమీ దినపత్రిక, వారపత్రిక, మాసపత్రిక కాదు, తలో పేరు పెట్టుకోవడానికి. కేసిఆర్ కేంద్రంతో ఫైట్ చేయాలనుకుంటే టీఆర్ఎస్ పేరు మీదే చేస్తారు. లేదూ అంటే ఓ ఫ్రంట్ పెడతారు. అప్పుడు దానికి నయాభారత్ అనే పెడితే పెట్టొచ్చు. అంతే తప్ప పార్టీ అయితే సమస్యే వుండదు.
ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ వుంది. ఇప్పటి నుంచీ కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వి, బోలెడు టైమ్ ఇచ్చి, తను ఇరుకున పడేలా చేసుకునేంత వెర్రివాడు కాదు కేసిఆర్.
కేసిఆర్ పార్టీలో కనిపించని అసమ్మతి ఇంతో అంతో వుంది. ఇప్పుడు కేంద్రంలోకి కేసిఆర్ వెళ్లిపోతారు. కేటిఆర్ నే సిఎమ్ అనే ప్రచారం వల్ల ఈ అసమ్మతి మరింత రాజుకునే అవకాశం వుంది. ఈ సంగతి కెసిఆర్ కు తెలియదా? ఇప్పటికిప్పుడు ఈ పార్టీ వ్యవహారం ఎందుకు తలకెత్తుకుంటారు.
దేశ వ్యాప్తంగా రాజకీయాల తీరు అంతబాగా లేదు. ప్రతిపక్షాల విషయంలో ఓ క్లారిటీ లేదు. ఇలాంటి టైమ్ లో కేసిఆర్ ఎందుకు తొందర పడతారు. అందువల్ల ఈ నయా భారత్ అన్నది నయా జోక్ తప్ప వేరు కాదు.