పవన్ కళ్యాణ్ సినిమా కోసం దాదాపు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు దర్శకుడు హరీష్ శంకర్. ఆఖరికి ఆ మధ్య ఆ సినిమాకు పూజ కూడా చేసారు. అయితే ఎప్పుడు సెట్ మీదకు వెళ్తుంది అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.
కానీ ఈ లోగా తనకు బాలయ్య తో సినిమా చేయాలని బలమైన కోరిక వుందని హరీష్ శంకర్ వేదిక మీదే బహిరంగంగా ప్రకటించారు. అక్కడితో ఆగలెేదు. మాంచి కథతో వచ్చి మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తా అంటూ బాలయ్యకు చెప్పేసారు. అక్కడితోనూ ఆగలేదు. దానికి నిర్మాతలు కూడా మైత్రీ మూవీస్ అంటూ చెప్పేసారు.
అంటే పవన్-హరీష్ ల సినిమా ను నిర్మించే మైత్రీనే బాలయ్య-హరీష్ ల సినిమా కూడా నిర్మిస్తుందన్నమాట. కానీ ఒకటే అనుమానం..ఈ సినిమా పవన్ సినిమా కన్నా ముందా? వెనుకా? ఎందుకంటే త్వరలో కథతో కలుస్తా అంటున్నారు హరీష్. కానీ పవన్ సినిమా ఈ ఏడాది చివరకు అన్నా ప్రారంభం అవుతుందా? అయితే ఎప్పటికి పూర్తవుతుంది. మరి అలాంటిది ఇప్పటికిప్పుడు బాలయ్యతో సినిమా కోసం కథ తయారు చేసే పని, అలాగే నిర్మాతలు రెడీ గా వుండడం చూస్తుంటే కాస్త అనుమానంగా వుంది.
ఒకవేళ పవన్ కనుక ఎన్నికల పనిలో పడితే, ఆ గ్యాప్ లో బాలయ్య సినిమా కొట్టేస్తారా? లేక పవన్ తో వర్క్ అయిన తరువాత సినిమా రెడీగా వుంచడం కోసమా? వెయిట్ అండ్ సీ. కానీ గమ్మత్తేమిటంటే హరీష్ స్పీచ్ మీద బాలయ్య అదే డయాస్ మీద సెటైర్లు వేయడం..కామెడీ అని మళ్లీ ఆయనే సర్ది చెప్పడం.