బాలయ్య గొంతు సవరిస్తే ఎలా ఉంటుందో అందరికీ అనుభవమే. తన గాత్రంతో ఆయన ఇప్పటికే కొన్ని గాయాలు చేశారు. క్లాసిక్స్ లాంటి పాటల్ని ఖూనీ చేశారు. ఇప్పుడీ 'సింహం' మరోసారి గొంతు సవరించబోతోంది.
ఈ బ్రేకింగ్ న్యూస్ స్వయంగా ఆయన గొంతు నుంచే వచ్చింది. బాలయ్య, అన్ స్టాపబుల్ అనే చిట్ ఛాట్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం ఓ పాట పాడారట బాలయ్య. అన్ స్టాపబుల్ అనే లిరిక్స్ తో సాగే ఆ పాట త్వరలోనే అందరి ముందుకొస్తుందంటూ బాంబు పేల్చారు.
గతంతో తన గాత్రంతో బాలయ్య చేసిన గాయాలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. “జగదేకవీరునికథ” సినిమాలోంచి “శివశంకరి” అనే పాటను పాడి అందర్నీ భయపెట్టారు బాలయ్య. చాలా ప్రాక్టీస్ చేసి పాడానంటూనే, పాటను ఖూనీ చేశారు.
సినీచరిత్రలో క్లాసిక్ సాంగ్ గా నిలిచిన ఆ పాటను బాలయ్య పాడడంపై అప్పట్లో చాలా విమర్శలు చెలరేగాయి. నాగబాబు లాంటివాళ్లయితే, “కరోనా కంటే ప్రమాదకమైన సంగీతం సర్కులేట్ అవుతోంది జాగ్రత్త” అంటూ సెటైర్ వేశారు. ఆ తర్వాత ఆ ట్వీట్ ను ఆయన డిలీట్ చేశారనుకోండి, అది వేరే సంగతి.
శివశంకరి పాట కంటే ముందు ఓ ఎన్నికల ప్రచారంలో బాలయ్య పాడిన “హే సితార బుల్ బుల్” అనే పాట ఇప్పటికీ చాలామందికి గుర్తే. ఈ పాట తర్వాతే కొంతమంది ఆయన్ను 'బుల్ బుల్ బాలయ్య' అంటూ సోషల్ మీడియాలో ఆటపట్టించడం మొదలుపెట్టారు.
ఈ పాటలకు అదనంగా ఆయన హిందీ-ఉర్దూలో కొన్ని 'తవికలు' కూడా చెబుతుంటారు. వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది.
మాది హిస్టరీ అని చెప్పుకునే బాలయ్యకు ఇలా పాటలు పాడడంలో 'మా చెడ్డ హిస్టరీ' ఉంది. అంత హిస్టరీని వెనకేసుకొని, మరోసారి మైక్ పట్టుకొని పాట పాడారు బాలకృష్ణ. 'ఆహా' ఆ పాటను కచ్చితంగా విని తీరాల్సిందే. ఆ పాట విన్నవాడు ఇక అన్ స్టాపబుల్ గా.