Advertisement

Advertisement


Home > Politics - National

భార్యతో గొడవ.. మతం మారిన భర్త

భార్యతో గొడవ.. మతం మారిన భర్త

భార్యతో గొడవపడి సన్యాసులుగా మారిన భర్తలున్నారు. భార్య వేధింపులు భరించలేక హంతకులుగా మారిన భర్తలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడో వ్యక్తి మాత్రం భార్య పోరు భరించలేక ఏకంగా మతం మారాడు. ఎందుకో తెలుసా?

ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ జిల్లాకు చెందిన వ్యక్తి ముఖేష్. ఇతడికి, ఇతడి భార్యకు తరచుగా గొడవలు జరుగుతుంటాయి. దీంతో భార్యతో గొడవలు భరించలేక, ముఖేష్ మతం మారాడు. ముఖేష్ కాస్తా అబ్దుల్ హుస్సేన్ గా మారాడు.

ఈ ప్రక్రియను కూడా ఇతడు పద్ధతిగా పూర్తిచేశాడు. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారబోతున్నట్టు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ తర్వాత బరేలీలోని హస్రత్ దర్గాకు వెళ్లి అబ్దుల్ హుస్సేన్ గా మారాడు.

ముస్లింగా మారిన తర్వాత అట్నుంచి అటు ఢిల్లీకి వెళ్లాడు. కొన్నాళ్లు ఇస్లాంకు సంబంధించిన ఆచార వ్యవహారాలు నేర్చుకున్నాడు. వస్త్రధారణ కూడా మార్చేశాడు. అలా తిరిగి ఇంటికొచ్చిన అబ్దుల్.. భార్యతో కలిసి ఉండలేదు. పశువుల దొడ్డిలో నివాసం ఏర్పాటుచేసుకున్నాడు.

భర్త ఇలా ముస్లింగా మారాడని తెలుసుకున్న భార్య, వెంటనే వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ముఖేష్ అలియాస్ అబ్దుల్ కు మతిస్థిమితం లేదని అంటున్నారు పోలీసులు. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు, ముఖేష్ ను నిర్బంధించామని తెలిపారు. అబ్దుల్ అలియాస్ ముఖేష్, తన భార్యకు తలాక్ చెప్పేందుకే ఇస్లాంలోకి మారి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. 

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా