సంక్రాంతి సినిమాలపై క్లారిటీ వచ్చేసినట్టేనా?

రజనీకాంత్ నటిస్తున్న దర్బార్ మూవీ విడుదల తేదీ కూడా మారడంతో సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. తాజా పరిణామాలతో సంక్రాంతి సినిమాలు ఫిక్స్ అయ్యాయి, థియేటర్లు లాక్ అయ్యాయి,…

రజనీకాంత్ నటిస్తున్న దర్బార్ మూవీ విడుదల తేదీ కూడా మారడంతో సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. తాజా పరిణామాలతో సంక్రాంతి సినిమాలు ఫిక్స్ అయ్యాయి, థియేటర్లు లాక్ అయ్యాయి, విడుదల తేదీలు కూడా ఓ కొలిక్కి వచ్చాయి.

లెక్కప్రకారం జనవరి 10 లేదా 11న రిలీజ్ అవ్వాలి దర్బార్ సినిమా. కానీ అలా చేస్తే మహేష్, బన్నీ సినిమాలతో పోటీ వస్తుంది. థియేటర్లు కూడా దొరకవు. ఎట్టకేలకు ఈ తకరారుపై సస్పెన్స్ వీడింది. దర్బార్ సినిమాను 9వ తేదీకి ప్రీ-పోన్ చేశారు.

ఇక మహేష్, బన్నీ సినిమాల మధ్య ఆల్రెడీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. మొన్నటివరకు ఈ రెండు సినిమాలు ఒకే తేదీకి లాక్ అయ్యాయి. కానీ దిల్ రాజుతో పాటు మరికొందరు సినీపెద్దలు కూర్చొని సయోధ్య కుదిర్చారు. అలా మహేష్ మూవీ సరిలేరు నీకెవ్వరు జనవరి 11న థియేటర్లలోకి వస్తుంది.

మహేష్ మూవీ వచ్చిన 24 గంటల తర్వాత, అంటే జనవరి 12న బన్నీ నటిస్తున్న అల వైకుంఠపురం సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మేరకు థియేటర్ల సర్దుబాటు పూర్తయింది. వీటితో పాటు చెప్పిన తేదీకే వస్తున్నాడు కల్యాణ్ రామ్. అతడు నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమాను జనవరి 15న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

సో.. సంక్రాంతి పోటీ షురూ అయింది. ఎన్ని సినిమాలొస్తున్నాయి, ఏఏ తేదీల్లో వస్తున్నాయనే లెక్కలు తేలిపోయాయి. రిజల్ట్ ఒక్కటే పెండింగ్.