లాక్ డౌన్ టైమ్ లో థియేటర్ల వ్యాపారంలో కాస్త నష్టాలు చవిచూసారు నిర్మాత దిల్ రాజు. అయితే ప్రొడక్షన్ లో మాత్రం భలే సక్సెస్ అయ్యారు. ఆయన సినిమాలు ఏవీ అండర్ ప్రొడక్షన్ లో లేవు. అన్నీ కూడా ప్రీ ప్రొడక్షన్ లెవెల్ లోనే ఎక్కువగా వున్నాయి. కేవలం వి సినిమా మాత్రమే ఆయనకు డెడ్ కాపిటల్ లా నాలుగైదు నెలలు వుండిపోయింది.
ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయింది. ఓటిటికి ఇచ్చేసారు. అందువల్ల మరో మూడు నెలల్లో విడతలు విడతలుగా క్యాష్ అయిపోతుంది. ఇలా ఓటిటి కి ఇవ్వడం వల్ల దిల్ రాజు, ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ భయంకరంగా సేఫ్ అయిపోయారు. మూడు కోట్లకు కాస్త అటు ఇటుగా ఓవర్ సీస్ బయ్యర్ వి సినిమాను తీసుకున్నారు.
అక్టోబర్ దాకా వెయిట్ చేయండి లేదంటే డబ్బులు వెనక్కు ఇస్తా అన్నారు. ఆ మేరకు మూడు కోట్లు ఇప్పుడు రిటర్న్ చేసారు. ఇలా జరక్కపోయి వుంటే ఇప్పుడు సినిమా ఫలితానికి ఓవర్ సీస్ బయ్యర్ గట్టి దెబ్బ తినేసి వుండేవారు.
అలాగే దిల్ రాజు తన సినిమాలను అమ్మరు. తనే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇప్పుడు వి ఫలితాన్ని బట్టి అలా డిస్ట్రిబ్యూట్ చేసి వుంటే కనీసం పది కోట్ల వరకు తేడా వచ్చి వుండేదని ఇండస్ట్రీ జనాలు లెక్కలు కడుతున్నారు. ఇప్పుడు అమెజాన్ కు ఇవ్వడం వల్ల దిల్ రాజు హ్యాపీగా గట్టెక్కేసారు