సెప్టెంబర్ అయిదు. హీరో నాని తొలి సినిమా విడుదలయిన డేట్. అదే సెంటిమెంట్ లో వి సినిమా విడుదలకు ముహుర్తం ఫిక్స్ చేసారు. నిజానికి ఇది కావాలని వచ్చిన డేట్ కాదు. కరోనా తీసుకువచ్చిన డేట్. కానీ నిజానికి దిల్ రాజు వైపు నుంచి చూస్తే ఇధి వెరీ బ్యాడ్ డేట్.
11 ఏళ్ల క్రితం ఇదే సెప్టెంబర్ 5న విడుదులయిన మరో సినిమా వుంది. అదే నాగ్ చైతన్య జోష్ సినిమా. దిల్ రాజు బ్యానర్ లో డిజాసర్ సినిమాల జాబితాలో అది కూడా ఒకటి. అలాంటి డేట్ ను కేవలం నాని సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఓకె అన్నారో లేక, ఇలాంటి సెంటిమెంట్లు తనకు లేవని, లైట్ తీసుకున్నారో మొత్తానికి సెప్టెంబర్ 5 డేట్ ఓ బ్యాడ్ డేట్ గా మిగిలిపోయింది ఆయన బ్యానర్ కు.
పైగా ఇటీవలి కాలంలో నాని సినిమాలు ఏవీ ఇంత భయంకరమైన ట్రోలింగ్ కు గురికాలేదు. అల వైకుంఠపురములో సినిమాతో మాంచి పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరక్టర్ థమన్ ను కూడా ట్రోలర్స్ వదలలేదు. ఎక్కడెక్కడ నుంచి బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ను కాపీ కొట్టిందీ మీమ్స్ చేసి మరీ వదిలారు. ఇన్నాళ్లుగా దర్శకుడు ఇంద్రగంటి సంపాదించుకున్న ఇమేజ్ మొత్తం ఈ ఒక్క సినిమా తీసి పక్కన పెట్టినట్లయింది. దీని తరువాత దిల్ రాజు బ్యానర్ లోనే ఇంద్రగంటి ఓ వంద కోట్ల బడ్జెట్ సినిమా తీయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు అదేమవుతుందో మరి?