జనసేన పార్టీలో నెంబర్ 'త్రీ'గా ఉన్న సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత అన్న నాగబాబు మరో సారి తన కామెడీ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. జన సైనికులు, వీర మహిళల సమస్యల గురించి తెలుసుకోవడానికి అంటూ కర్నూల్ లో పర్యటిస్తున్నా నాగబాబు టీడీపీ- జనసేన పొత్తులపై మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రం మొత్తానికి తెలిసిన టీడీపీ-పవన్ బంధంపై నాగబాబు తెలియనట్లు మాట్లాడారు.
నాగబాబు మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులు ఎవరితో అనేది మా పార్టీ అధ్యక్షుడు పవన్ నిర్ణయిస్తాడని.. పొత్తులు కుదిరిన తరువాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే నిర్ణయం తీసుకుంటామాని, అలాగే పొత్తులు లేకపోతే రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని కామెడీ చేశారు. కామెడీ ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ సింగిల్ వెళ్లే ప్రసక్తినే లేదని చెప్పినా నాగబాబు ఇలా మాట్లాడటం కామెడీ కాక ఏమౌతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సింగిల్ గా పోటీ చేస్తే తాను వీరమరణం పొందుతా అని ప్రకటించినా కూడా నాగబాబు ఇలా కామెడీ మాటలు చెప్తున్నారు.
అలాగే నటుడు, వైసీపీ నేత అలీ.. పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం అన్న వ్యాఖ్యలపై నాగబాబు నో కామెంట్స్ అంటూ తప్పించుకున్నారు. అలాగే తన తమ్ముడు లాగానే వైసీపీ నేతలపై విమర్శలు కురిపించారు.