ఇంద్రగంటి లాంటి దర్శకుడు చెప్పారు కాబట్టి నిర్మాత దిల్ రాజు ఆ కథకు ఓకె అని వుంటారు. అదే ఎవరైనా అప్ కమింగ్ డైరక్టర్ వచ్చి వి లాంటి కథ చెబితే, ఎగా దిగా చూసి వుండేవారు. దిల్ రాజు సంగతి ఏమో కానీ ఇంద్రగంటి తయారు చేసిన వి కథ విని ఓ పెద్ద హీరో ఇలాగే ఫీలయ్యారని తెలుస్తోంది.
బన్నీ-దిల్ రాజుకు ఐకాన్ సినిమా చేయడానికి ఒకె అనక ముందు వి సినిమా కథ అటు వెళ్లినట్లు తెలుస్తోంది. డైరక్టర్ ఎవరు అన్నది సంబంధం లేకుండా డిఫరెంట్ కథ ల కోసం చూస్తున్న బన్నీ ' వి ' కథ విని, తన సన్నిహితుల దగ్గర బుస్ మన్నాడట. ఇలాంటి కథలు అన్నీ పంపిస్తారేంటీ అని బన్నీ కామెంట్ చేసినట్లు ఆయన సన్నిహత వర్గాల బోగట్టా.
దాంతో ఈ కథ సాయి ధరమ్ తేజ్ దగ్గరకు వెళ్లింది. ఆల్రెడీ జైజవాన్ సినిమా చేసాను కదా..ఇద్దరు ప్రెండ్స్ ఒకరు విలన్..ఒకరు హీరో అన్న లైన్ తో, మళ్లీ ఈ సినిమానా? అని ఆయన రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో దిల్ రాజు ఎలాగోలా కిందా మీదా పడి నాని-సుధీర్ బాబుల కాంబినేషన్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. అలా మొత్తం మీద బాల్ నాని కోర్టులోకి చేరి వి సినిమాగా బయటకు వచ్చింది.