మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా షూట్ నాన్ స్టాప్ గా సాగుతోంది. అగస్ట్ 11 విడుదల టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకే అస్సలు గ్యాప్ ఇవ్వకుండా షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు.
సినిమా త్రివిక్రమ్ టైప్ ఫక్తు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ విత్ యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. జగపతిబాబు ఒక విలన్. మరో విలన్ కూడా వుంటారు. ఖలేజా మాదిరిగా మాంచి యాక్షన్ సీక్సెన్స్ లు వుంటాయని తెలుస్తోంది.
సినిమాలో హీరో ఫుల్ గా పంచ్ లు వేస్తూ, ఫన్ కూడా పండించే క్యారెక్టర్ అని బోగట్టా. కథకు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ అయినా బలమైన యాక్షన్ సీన్లు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సారథి స్టూడియో జరుగుతున్న షూటింగ్, తరువాత భారీ ఇంటి సెట్ కు షిఫ్ట్ అవుతుంది.
పండగ సినిమాల హడావుడి నుంచి బయటపడిన థమన్ ఇప్పుడు ఈ సినిమాకు స్వరాలు తయారుచేసే పనిలో పడ్డారు. త్రివిక్రమ్ ఓ షెడ్యూలు చేసి, ఫ్రీ అయ్యేలోగా ట్యూన్ లు తయారు చేసి వినిపించే పనిలో బిజీగా వుగా వున్నారట థమన్. ఈ సినిమా అడియో మీద చాలా భారీ అంచనాలు వున్నాయి. వాటిని కచ్చితంగా అందుకోవాల్సి వుంటుంది.