బాబు వస్తే సంక్షేమ పధకాలు కట్…ఇది పక్కా

చంద్రబాబుకు సంక్షేమ పధకాలకు ఎపుడూ పడదు. ఆయన సంక్షేమ రాజ్యం ఎపుడూ తేలేదు. ఆయన ఆలోచనలు వేరు. ఆయన కనుక పొరపాటున ఏపీలో అధికారంలోకి వస్తే సంక్షేమ పధకాలు కట్ చేసి పారేస్తారు. ఇది…

చంద్రబాబుకు సంక్షేమ పధకాలకు ఎపుడూ పడదు. ఆయన సంక్షేమ రాజ్యం ఎపుడూ తేలేదు. ఆయన ఆలోచనలు వేరు. ఆయన కనుక పొరపాటున ఏపీలో అధికారంలోకి వస్తే సంక్షేమ పధకాలు కట్ చేసి పారేస్తారు. ఇది పక్కా. ఈ మాటలు అంటున్నది వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.

ఆయన గడపగడపకు కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలే చేశారు. బాబుకు ఒకరికి పెట్టడం అంటే ఇష్టం ఉండదు. ఎంతసేపూ తన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తన వారి కోసమే బాబు అధికారం వాడుతారు అని అన్నారు. అమరావతి రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ బిజినెస్ కి బాబు తెర తీశారని ఆయన విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం ప్రతీ ఇంటికీ ప్రతీ పేదలు సంక్షేమ పధకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తోంద‌ని, ఈ సంక్షేమన్ని పూర్తిగా కొనసాగించాలన్నా పేదలకు న్యాయం జరగాలన్నా బాబుని  ఎప్పటికీ అధికారంలోకి రాకుండా అడ్డుకుని తీరాల్సిందే అని సీనియర్ మంత్రి పిలుపు ఇచ్చారు. చంద్రబాబు చెప్పే మాయమాటలను అసలు నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.

ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అని వారే సరైన తీర్పరులు అని ధర్మాన అన్నారు. కరోనా వంటి కష్టకాలంలో వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి నిత్యావసర సరుకులు ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు. పనిచేసే ప్రభుత్వం పది కాలాలు ఉండాలని ధర్మాన ఆకాంక్షించారు. విశాఖ రాజధాని అయితేనే ఏపీకి పెట్టుబడులు వస్తాయని, వైజాగ్ కి ఆ ఠీవీ హోదా ఉందని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రాజధాని అని చంద్రబాబు జనం ముందుకు వస్తే అక్కడ ఎందుకు అని ప్రజలే ఆయనను ఎదురు ప్రశ్నించాలని ధర్మాన కోరారు

ఈ విషయాలు పక్కన పెడితే చంద్రబాబుకు సంక్షేమ పధకాలు ఇవ్వడం ఇష్టం ఉండడు, ఆయన వస్తే పధకాలు అన్నీ కట్ అన్న మాటలు మాత్రం పవర్ ఫుల్ గానే చూడాలి. ఇవి జనం మెదళ్ళలో ఎక్కాయంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని పొర్లు దండాలు పెట్టినా అధికారం ముఖం చూడలేదు అని అంటున్నారు.