మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి స్ట్రాంగ్ గానే డోస్ పడింది. నోరుంది కదా అని రెచ్చిపోవడం మాట్లాడితే ముఖ్యమంత్రి జగన్ని సైకో అంటూ దుర్భాషలు ఆడడం తనకే చెల్లు అని అంటున్నారు.వైసీపీ నేతలు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు గట్టిగానే కౌంటర్ ఈచ్చారు.
అయ్యన్నకు పిచ్చి బాగా ముదిరిపోయిందంటూ బూడి తగులుకున్నారు. అపుడే తమ ప్రభుత్వం వచ్చినట్లుగా తాను హో మంత్రిగా సీట్లో కూర్చున్నట్లుగా అయ్యన్న మాట్లాడుతున్నారని, ఈ పిచ్చి కలలు అలాగే కంటూ ఉండమని బూడి పెట్టాల్సిన నాలుగూ పెట్టేశారు.
చంద్రబాబు లోకేష్ అనే సైకోలు ఇద్దరు ఏపీలో ఉన్నారు. వారికి మించిన పెద్ద సైకో ఈ అయ్యన్నపాత్రుడు అన్నారు బూడి. తాము ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేసి డ్వాక్రా అక్క చెల్లెమ్మలను ఏడిపించారు. రైతులకు కన్నీళ్ళు తెపించారు. యువతకు జాబ్స్ ఇవ్వకుండా కలతపడేట్లు చేశారు. ఇలా అన్ని వర్గాల కంట నీరు ఒలికించి పెదబాబు చినబాబు అయ్యన్న నవ్వుతూ అయిదేళ్ళ పాలన చేశారని, వీరిని మించిన సైకోలు వేరే ఉన్నారు అని నిలదీశారు.
మీరు ఇచ్చిన ఆరు వందల యాభై హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. జన్మ భూమి కమిటీలు పెట్టి జనాలను దోచుకున్న మీ చరిత్ర మరచిపోతే పోయేదా అయ్యన్నా అని నిగ్గదీశారు. ఏదో గతాన్ని మరచిపోయి మళ్ళీ మాకే అధికారం ఇస్తాను జనాలు అనుకుంటే అదంతా మీ పిచ్చి భ్రమ తప్ప మరోటి కానే కాదని బూడి సెటైర్లు వేశారు.
ఏమి ఉద్ధరించారని మిమ్మల్ని మళ్ళీ ఎన్నుకుంటారని, గతంలో మీ పాలన పీడ కలను ఎలా మరచిపోతారనుకున్నారని ఆయన ప్రశ్నించారు. మీకు మళ్లీ అధికారం కల్ల. ఆ సంగతి మీకూ తెలుసు. ఆత్మ న్యూనతా భావం, అభద్రతాభావంతో సైకో లుగా మారి జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. అయ్యన్న ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే ఇంతకు ఇంతా జనాలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. అన్న దానికి అంతా అందుకున్న అయ్యన్నకు ఇది సరిపోయిందా ఇంకా డోస్ కావాలా అని వైసీపీ నేతలు అడుగుతున్నారు.