ట్రయిలర్ తో అర్జున్ సురవరం ఈజ్ బ్యాక్

కొన్నాళ్ల క్రితం ప్రచారంతో హఢావుడి, హల్ చల్ చేసిన అర్జున్ సురవరం సినిమా సడెన్ గా ఇబ్బందుల్లో పడింది. అంతా అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు బాలారిష్టాలు తీర్చుకుని విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో ట్రయిలర్…

కొన్నాళ్ల క్రితం ప్రచారంతో హఢావుడి, హల్ చల్ చేసిన అర్జున్ సురవరం సినిమా సడెన్ గా ఇబ్బందుల్లో పడింది. అంతా అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు బాలారిష్టాలు తీర్చుకుని విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో ట్రయిలర్ ను విడుదల చేసారు. ఓ మాంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కు సరిపడే మెటీరియల్ తో ఎక్కడా లూజ్ ఎండ్స్ లేకుండా బాగా కట్ చేసారు ట్రయిలర్ ను. 

అర్జున్ సురవరం సినిమా తమిళ సినిమా కణితన్ కు రీమేక్ అని ఎలాగూ తెలుసు. అందుకే సినిమా లైన్ కానీ, పాయింట్ కానీ దాచే ప్రయత్నం చేయలేదు. పక్కాగా సినిమాలో కథ ఏ లైన్ లో, ఏ ఆర్డర్ లో చెప్పదలుచుకున్నారో అదే లైన్ లో, అదే ఆర్డర్ లో ట్రయిలర్ ను కట్ చేసినట్లు కనిపిస్తోంది. 

కథ అంతా హీరో చుట్టూనే తిరిగినట్లు కనిపిస్తోంది. లావణ్యకు అంత పెద్ద రోల్ వున్నట్లు ట్రయిలర్ లో అయితే తెలియడం లేదు. బ్యాక్ గ్రవుండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నట్లు ట్రయిలర్ క్లారిటీగా చెబుతోంది. టాగోర్ మధు, ఆకెళ్ల రాజ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా 29న థియేటర్లలోకి వస్తుంది.