‘ఎఎఎ’ లో స్పెషల్ డిజిటల్ బన్నీ

ఆసియన్ మహేష్ బాబు మల్టీ ఫ్లెక్స్ తరువాత మళ్లీ అంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గా తయారవుతోంది. ఆసియన్ అల్లు అర్జున్ మల్టీ ఫ్లెక్స్. అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ ప్లేస్ లో చకచకా…

ఆసియన్ మహేష్ బాబు మల్టీ ఫ్లెక్స్ తరువాత మళ్లీ అంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గా తయారవుతోంది. ఆసియన్ అల్లు అర్జున్ మల్టీ ఫ్లెక్స్. అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ ప్లేస్ లో చకచకా రెడీ అవుతోంది ఈ మాల్ కమ్ మల్టీ ఫ్లెక్స్. ఈ మల్టీ ఫ్లెక్స్ ను లగ్జరియస్ డిజైన్ తో తయారు చేస్తున్నారని తెలుస్తోంది.

అయితే అన్నింటికీ మించి పిల్లలను, పెద్లలను ఎంటర్ టైన్ చేసేలా ఓ టెక్నాలజీ వండర్ ను ఈ మల్టీ ఫ్లెక్స్ లో ఏర్పాటు చేసే ప్రయత్నం స్టార్ట్ చేసారు. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, లార్జ్ డిజిటల్ స్క్రీన్ మీద బన్నీ విజువల్ వుంటంది. దాని ముందు నిల్చున్నవారు ఏ హైట్ లో వుంటే ఆ హైట్ లోకి ఆ విజువల్ మారిపోతుంది.

చిన్న పిల్లాడు వుంటే ఆ సైజ్ లోకి. పైగా ఆ డిజిటల్ స్క్రీన్ ముందు నిల్చున్నవారు ఎలా మూవ్ అయితే ఆ విజువల్ అలా మూవ్ అవుతుంది. ఎలా మాట్లాడితే అదే మాట్లాడుతుంది. ఇలాంటి టెక్నాలజీ వండర్ ను ఏర్పాటు చేయడానికి సంబంధిత కంపెనీతో డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈ ఒక్కదానికే రెండు కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. 

అయితే టెక్నాలజీ, ట్రయిల్ అండ్ ఎర్రర్ సందేహాలు, ఇలా అన్నీ పరిశీలిస్తున్నారు. అన్నీ వర్కవుట్ అయితే, ఎఎఎ లో అది ఏర్పాటవుతుంది.