గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసిన దర్మాడి సత్యంలో ఉన్న పట్టుదల సీఎం జగన్‌లో ఉంటే బాగుండేదని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అన్నారు.
తణుకులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వరదలు వస్తే విదేశాలకు వెళతారని ఆయన అన్నారు.
జగన్ జైలుకు వెళ్లి వచ్చాడు కాబట్టి.. రాష్ట్ర ప్రజలందరినీ జైలుకు పంపించాలని చూస్తున్నారని అన్నారు. మీడియాపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మీడియాకు అండగా తాను ఉంటానని చంద్రబాబు చెప్పారు.
పేదవాళ్లను చదివిస్తామంటే ముందుగా మద్దతు ఇచ్చేది టీడీపీనే అని చంద్రబాబు పేర్కొన్నారు.
సభలో టీడీపీ తరఫున ఇరవై మూడు మంది పులులు ఉంటే ఒక పులి బయటికి వెళ్లిపోయిందన్నారు. అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.