మే 1 మీద సాయితేజ్ రుమాలు

ఇవ్వాళ, రేపు సినిమాలకు డేట్ లు సమస్య అయిపోతోంది. థియేటర్లు లేక కాదు, కలెక్షన్లు లేక. అందుకే సోలో డేటే సో బెటరు అనుకోవాల్సి వస్తోంది. అందుకోసం ఎప్పుడో ఆరునెలలు ముందుగా డేట్ మీద…

ఇవ్వాళ, రేపు సినిమాలకు డేట్ లు సమస్య అయిపోతోంది. థియేటర్లు లేక కాదు, కలెక్షన్లు లేక. అందుకే సోలో డేటే సో బెటరు అనుకోవాల్సి వస్తోంది. అందుకోసం ఎప్పుడో ఆరునెలలు ముందుగా డేట్ మీద రుమాలు వేస్తున్నారు.

ఇప్పటికే జనవరి, ఫిబ్రవరి నెలలు ఆల్ మోస్ట్ ఫుల్ అయిపోయాయి. మార్చి, ఏప్రియల్ ఎగ్జామ్స్ సీజన్. అందుకే మే నెల మీద పడ్డారు.

ముందుగే మే 1న తమ సినిమా విడుదల చేయబోతున్నట్లు నిర్మాత భోగవిల్లి ప్రసాద్ ప్రకటించబోతున్నారు. ఆయన హీరో సాయి తేజ్ తో కలిసి నిర్మిస్తున్న 'సోలో బతుకే సో బెటరు' సినిమాకు మే1 డేట్ లాక్ చేసారు. ఆ రోజు శుక్రవారం కావడం, మే డే సెలవు వుంటుంది కనుక, ఆ రోజు ఫిక్స్ చేసుకున్నారు.

ఈ సినిమాలో సాయి తేజ్ సరసన నభానటేష్ నటిస్తున్న ఈ సినిమాకు సుబ్బు అనే కొత్త దర్శకుడు పని చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.