నేను చాలా హాట్.. గుర్తించినందుకు థ్యాంక్స్

కొంతమంది హీరోయిన్లలో హాట్ నెస్ ఇలా చూస్తేనే అర్థమౌతుంది. ఈ అమ్మాయి చాలా హాట్ గురూ అనుకుంటాం. అయితే మరికొందరు మాత్రం హాట్ నెస్ కు దూరంగా ఉంటారు. చూడ్డానికి చాలా హోమ్లీగా అనిపిస్తారు.…

కొంతమంది హీరోయిన్లలో హాట్ నెస్ ఇలా చూస్తేనే అర్థమౌతుంది. ఈ అమ్మాయి చాలా హాట్ గురూ అనుకుంటాం. అయితే మరికొందరు మాత్రం హాట్ నెస్ కు దూరంగా ఉంటారు. చూడ్డానికి చాలా హోమ్లీగా అనిపిస్తారు. ఇలాంటి ఇమేజ్ ను హీరోయిన్లు కోరుకోరు. ఎంత హాట్ గా కనిపిస్తే అంత క్రేజ్. సేమ్ టైం, అవకాశాలు కూడా బాగా వస్తాయి. అందుకే హాట్ గా కనిపించేందుకు ఈషా రెబ్బ తెగ ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో తనలో హాట్ నెస్ ను గుర్తించినందుకు థ్యాంక్స్ చెబుతోంది ఈ బ్యూటీ.

రాగల 24 గంటల్లో అనే సినిమాలో అందంగా కనిపిస్తూనే, హాట్ గా కూడా మెప్పించింది ఈషా రెబ్బ. ఈ సినిమాలో ఆమెపై కొన్ని ఘాటైన బెడ్ రూమ్ సీన్స్, కొన్ని లిప్ కిస్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. వాటిని ట్రయిలర్ లో మచ్చుకు కొన్ని చూపించారు. ఈ సినిమాలో తను హాట్ గా కనిపించానని, తనలో కూడా హాట్ నెస్ ఉందనే విషయాన్ని గుర్తించినందుకు థ్యాంక్స్ కూడా చెబుతోంది ఈషా.

“నేనెప్పుడూ హాట్ గానే ఉంటాను. కాకపోతే తెలుగమ్మాయి అనేసరికి సినిమాల్లో స్టీరియోటైపులో చూపిస్తున్నారు. నాలో హాట్ నెస్ ను మేకర్స్ చూపించలేదు. విలేజ్ బ్యాక్ డ్రాప్, ట్రెడిషనల్ పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు. అందుకే ఇనస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫొటోలు పెడుతున్నాను. ఇప్పటికైనా గుర్తించినందుకు థ్యాంక్స్.”

తెలుగమ్మాయి అనే ట్యాగ్ లైన్ వల్ల ఇండస్ట్రీలో ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నానంటోంది ఈషా రెబ్బ. ఆఫర్లు తగ్గిపోతుంటాయని, స్టీరియోటైపు పాత్రలకే ఫిక్స్ చేస్తారని అంటోంది. తనకు ఛాన్స్ ఇస్తే హాట్ గా కనిపించడానికి, గ్లామర్ ఒలకబోయడానికి ఏమాత్రం అభ్యంతరం లేదంటోంది. ఈ తాజా స్టేట్ మెంట్ తోనైనా ఈషాకు అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి

Click Here For Photo Gallery