రాజ్యశ్యామల యాగంలో జగన్…రాజ్యం పదిలం

రాజ్యశ్యామల యాగం చాలా పవర్ ఫుల్ అని ఈ మధ్యనే అందరికీ అర్ధమవుతోంది. కేసీయార్ రెండవసారి అధికారం కోసం విశాఖ శారదాపీఠం ఆద్వర్యంలో హైదరాబాద్ లో రాజ్యశ్యామల యాగం చేయించారు. అనుకున్నది సాధించారు. గతసారి…

రాజ్యశ్యామల యాగం చాలా పవర్ ఫుల్ అని ఈ మధ్యనే అందరికీ అర్ధమవుతోంది. కేసీయార్ రెండవసారి అధికారం కోసం విశాఖ శారదాపీఠం ఆద్వర్యంలో హైదరాబాద్ లో రాజ్యశ్యామల యాగం చేయించారు. అనుకున్నది సాధించారు. గతసారి జగన్ విపక్షంలో ఉన్నపుడు రాజశ్యామల యాగంలో పాలుపంచుకున్నారు.

ఇపుడు జగన్ మరోమారు రాజశ్యామలయాగంలో పాల్గొనబోతున్నారు. ఈ నెల 28న విశాఖ శారదాపీఠంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ హాజరవుతున్నారు. అక్కడ జరిగే రాజశ్యామల యాగంలో ముఖ్యమంత్రి స్వయంగా పాలుపంచుకుంటారు. దాంతో సీఎం రాక సందర్భంగా పీఠం పరిసరాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

ఇదిలా ఉండగా మరోమారు జగన్ ఏపీకి సీఎం కావడం ఖాయమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఆయన జాతకంలో ప్రస్తుతం మహర్దశ నడుస్తోందని దాంతో ఆయనకు రాజయోగం కొనసాగుతుందని అంటున్నారు. రాజకీయ పరిణామాలు సామాజిక పరిస్థితులు ఎలా ఉన్న జగన్ మహర్జాతకంతో మరో మారు ఏపీకి సీఎం కావడం పక్కా అని జ్యోతీష్య పండితులు కూడా చెబుతున్నారు. 

రాజశ్యామల అమ్మవారి కరుణ కూడా జగన్ కి పుష్కలంగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ యాగంలో సీఎం పాలుపంచుకోవడం రాజకీయంగా కూడా ఆసక్తిని రేపుతోంది.