మంచు మనోజ్ స్పెషల్ న్యూస్ ఇస్తానంటే ఎవరైనా ఏం అనుకుంటారు.. అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషం ఏదో ఉందని ఎక్స్ పెక్ట్ చేస్తారు. అలా ఆశించడానికి కారణం కూడా అతడే. రెండో పెళ్లికి సంబంధించి మనోజ్ చుట్టూ చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ మేటర్ ఎనౌన్స్ చేస్తాడని అంతా అనుకున్నారు.
కానీ మంచు మనోజ్ మాత్రం హైప్ ఇచ్చి తుస్సుమనిపించాడు. స్పెషల్ న్యూస్ అంటూ తన కొత్త సినిమా వివరాల్ని వెల్లడించాడు. సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ తనపై ప్రేమ కురిపిస్తున్నారని, ఆ ప్రేమను తిరిగి ఇచ్చేస్తానంటూ కొత్త సినిమా ప్రకటించాడు.
నిజానికి చాన్నాళ్ల కిందటే ఓ సినిమా ప్రకటించాడు మంచు మనోజ్. అహం బ్రహ్మస్మి అనే టైటిల్ కూడా ఎనౌన్స్ చేశాడు. పాన్ ఇండియా కలరింగ్ కూడా ఇచ్చాడు. ఆ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేదు. అంతలోనే “స్పెషల్ న్యూస్” చెబుతానంటూ మరో సినిమాతో ముందుకొచ్చాడు ఈ మంచు హీరో.
ఇలా ఊరించి తుస్సుమనిపించడం ఇండస్ట్రీలో కొత్తకాదు. గతంలో చాలామంది ఈ పని చేశారు. ఇప్పుడు మంచు మనోజ్ వంతు వచ్చిందంతే. ఏదో ఆశిస్తే, ఇంకేదో అప్ డేట్ ఇచ్చాడంటూ ఇతడి సోషల్ మీడియా పేజీలో కామెంట్లు పడుతున్నాయిు. ఇంతకీ ఇతడు ప్రకటించిన ఆ కొత్త సినిమా పేరేంటో తెలుసా.. 'వాట్ ద ఫిష్'.