సెలబ్రిటీలు చనిపోయారంటూ పుకార్లు రావడం కొత్తేం కాదు. చాలామంది హీరోహీరోయిన్ల విషయంలో ఇది జరిగింది. మరీ ముఖ్యంగా వయసు మళ్లిన నటీనటులపై ఇలాంటి ఊహాగానాలు సర్వసాధారణమయ్యాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి నటి, పొలిటీషియన్ దివ్య స్పందన కూడా చేరిపోయింది.
ఈ హీరోయిన్ చనిపోయిందంటూ ఈరోజు ఉదయం నుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. కొంతమంది కన్ ఫర్మ్ చేసుకోకుండా, శ్రద్ధాంజలి కూడా ఘటించేశారు. మరికొంతమంది రిప్ దివ్య స్పందన అంటూ హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేశారు. కానీ ఆమె బతికే ఉంది.
దివ్య స్పందన చనిపోయిందనే పుకార్లు వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ న్యూస్ వందశాతం అబద్ధమని కొట్టిపారేసింది. ప్రస్తుతం ఆమె సేఫ్ గా, ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించింది. ఆ వెంటనే పలువురు కోలీవుడ్ జర్నలిస్టులు కూడా ఈ మేటర్ పై స్పందించారు.
ఊహించని విధంగా వచ్చిన పుకారుతో కొంతమంది ఆమెకు ఫోన్ చేశారు. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్ లో ఉంది. ప్రశాంతంగా పడుకుంటే, కొంతమంది జర్నలిస్టులు ఆమెకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేశారు. తాజా పుకార్లతో దివ్య స్పందన షాక్ అయింది. తను చనిపోయానని చెప్పింది ఎవరంటూ ఆమె మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలుగు ప్రేక్షకులకు రమ్యగా పరిచయమైంది దివ్య స్పందన. అభిమన్యు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి సినిమాలతో పాపులర్ అయింది. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఆమె సినిమాల్లో కూడా కొనసాగుతోంది.