చిన్న సినిమా – కొత్త ఐడియా

రోజుల మారాయి. చిన్న సినిమా అంటే జనాలు థియేటర్ కు కిలోమీటర్ దూరంలో వుంటున్నారు. చిన్న సినిమాకు జనాల్ని థియేటర్ కు రప్పించాలంటే అద్భుతాలు చేయాల్సిందే. అందుకే ఇలాంటి టైమ్ లో ఓ చిన్న సినిమా…

రోజుల మారాయి. చిన్న సినిమా అంటే జనాలు థియేటర్ కు కిలోమీటర్ దూరంలో వుంటున్నారు. చిన్న సినిమాకు జనాల్ని థియేటర్ కు రప్పించాలంటే అద్భుతాలు చేయాల్సిందే. అందుకే ఇలాంటి టైమ్ లో ఓ చిన్న సినిమా నిర్మాతలు కొత్త ఐడియా చేసారు.

రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు, చిత్రాల్లో నటించిన చేతన్ మద్దినేని తొలిసారి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం “బీచ్ రోడ్ చేతన్”. కాస్త రా అండ్ రఫ్ సినిమా ఇది. పైగా ఈ సినిమాను పూర్తిగా ఐ ఫోన్ తో చిత్రీకరించడం విశేషం

ఈ సినిమాకు జనాల్ని రప్పించడానికి ఓ మాంచి ప్లాన్ వేసారు. తొలిరోజు సినిమాను ఫ్రీగా ప్రదర్శిస్తున్నారు. ఎవరైనా సరే థియేటర్ మార్నింగ్ షో కు వచ్చి, ఫ్రీగా సినిమా చూసి వెళ్లిపోవచ్చు. ఈ ఐడియా బాగానే వుంది.ఎందుకంటే తొలి రోజు మొదటి ఆటకు పది మంది వచ్చినా, పాతిక మంది వచ్చినా సినిమా వేయాల్సిందే. థియేటర్ రెంట్ కట్టాల్సిందే.

అలాంటపుడు ఫ్రీగా వేసేస్తే కనీసం మౌత్ టాక్ అయిన స్ప్రెడ్ వుతుంది. అదీ ఐడియా. చిన్న సినిమాకు మౌత్ టాక్ తోనే కదా జనం వచ్చేది. ఆ మౌత్ టాక్ కోసం ఈ ఐడియా అన్నమాట.

చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ను నవంబర్ 16న విడుదల చేసారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శక-నిర్మాత-హీరో చేతన్ మద్దినేని తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు , హీరో చేతన్ మాట్లాడుతూ…నవంబర్ 22న మా బీచ్ రోడ్ చేతన్ విడుదల కాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్స్ ఏపీ, తెలంగాణలో ఉచితంగా ఇస్తున్నాము. దాదాపు 200 థియేటర్స్ లో మా సినిమా విడుదల కాబోతోంది.

ఫస్ట్ డే మార్నింగ్ షో నుండి మా సినిమాకు పాజిటీవ్ టాక్ వస్తుందని భావిస్తున్నాను. ఒక ప్రయోగాత్మకమైన సినిమాతో మీ ముందుకు వస్తున్నాము అన్నారు.