Advertisement

Advertisement


Home > Movies - Movie News

రాశీఖన్నా 'బావా' అంటూ వచ్చేసింది

రాశీఖన్నా 'బావా' అంటూ వచ్చేసింది

అందాల రాశి..ఖన్నా, దర్శకుడు మారుతి, నిర్మాత బన్నీవాస్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ప్రతి రోజూ పండగే. సాయి తేజ్ హీరో. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మూడో పాట వచ్చింది. బావా మా అక్కను చక్కగ చూస్తావా అనే కలర్ ఫుల్ పాటను వదిలారు.

పాట మేకింగ్ విడియో ప్లస్ పాట కోసం తయారుచేసిన ప్రమోషన్ విడియో కలిపి మిక్స్ చేసి ఓ కలర్ ఫుల్ విడియోను తయారు చేసారు. లైట్ ర్యాప్ టచ్ ఇస్తూ సాగిన ఈ సాంగ్ పిక్చరైజేషన్ చాలా కలర్ ఫుల్ గా వుంటుందని తెలుస్తూనే వుంది.

థమన్ ఇచ్చిన ట్యూన్ క్యాచీగానే వుంది. అందువల్ల పాట బాగానే రిజిస్టర్ అయ్యే అవకాశం వుంది. ఇప్పటికి వచ్చిన రెండు పాటలు ఫరవాలేదు అనిపించుకున్నాయి. ఇంకా మరో మూడు పాటలు రావాల్సి వుంది.

వీటిలో ఒకటి డ్యూయట్, ఒకటి సినిమా ఆరంభంలో, ముగింపులో రన్ అయ్యే సాంగ్ వున్నాయి. ఇవి కాక మరోపాట కూడా వుంటుంది.

ఈ మధ్య పాటలు కూడా సినిమాల ఓపెనింగ్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే ప్రతిరోజూ పండగే సినిమాకు పాజిటివ్ ఓపెనింగ్స్ కు పాటలు సహకరించేలాగే వున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?