వైఎస్సార్సీపీ- ప్రశాంత్ కిషోర్ డీల్ ఎన్ని కోట్లంటే!

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తాము మొత్తం 85 కోట్ల రూపాయలను వెచ్చించినట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ ఎక్స్పెండేచర్ స్టేట్ మెంట్లో పేర్కొంది. ఎన్నికల సంఘానికి సమర్పించిన ఈ నివేదికలో ఆ డబ్బును…

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తాము మొత్తం 85 కోట్ల రూపాయలను వెచ్చించినట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ ఎక్స్పెండేచర్ స్టేట్ మెంట్లో పేర్కొంది. ఎన్నికల సంఘానికి సమర్పించిన ఈ నివేదికలో ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టిన అంశాన్ని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

ఇందులో మెజారిటీ వాటా ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ కు చెల్లించినట్టుగా వైసీపీ పేర్కొంది. మొత్తం 37 కోట్ల రూపాయలను ప్రశాంత్ కిషోర్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెల్లించినట్టుగా తెలుస్తోంది.

మిగిలిన మొత్తం లో 36  కోట్ల రూపాయల మొత్తాన్ని ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా యాడ్స్ కు చెల్లించినట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆ 36 కోట్ల రూపాయల్లో 24 కోట్ల రూపాయలు వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన జగతి మీడియాకే చెల్లించడం గమనార్హం.

ఇక తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ఖర్చు 77 కోట్ల రూపాయలు అని పేర్కొంది. అందులో 49 కోట్ల రూపాయలను ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియాకే చెల్లించినట్టుగా తెలుగుదేశం పార్టీ వివరించింది. ఎన్నికలు ముగిసే  సమయానికి తన ఖాతాలో 155 కోట్ల రూపాయలను కలిగి ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.