తమ సరదా సమయాన్ని జంటగా గడుపుతూ, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బహిరంగ పరుచుకుంటూ ఉన్నారు నయనతార-విఘ్నేష్ శివన్. ఇది వరకూ బోలెడన్ని సందర్భాల్లో వీరిద్దరూ సెల్ఫీలను పోస్టు చేశారు. తమ బంధాన్ని అలా చాటుకున్నారు.
ఇటీవలే విఘ్నేశ్ శివన్ బర్త్ డేను నయనతార గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఇప్పుడు నయనతార పుట్టిన రోజు వంతు వచ్చింది. ఈ రోజు నయనతార పుట్టిన రోజు. ఇప్పటికే ఈ జంట అమెరికాకు చేరుకుంది. అక్కడ జంటగా విహరిస్తూ ఉంది.
వీరిద్దరూ యూఎస్ లో జంటగా తిరుగుతూ దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్టు చేశాడు విఘ్నేష్. ఆమెతో ఉండటంలో తన ఆనందాన్ని ఈ దర్శకుడు ఆ పోస్టుల్లో వివరించాడు. ఇలా సరదాగా, ప్రేమగా సాగిపోతూ ఉంది ఈ జంట. బై ది వే..హ్యాపీ బర్త్ డే నయనతార!