షాకింగ్ విషయాలు బయటపెట్టిన వంశీ

సోషల్ మీడియాలో అభూతకల్పనల్ని సృష్టించడానికి, వైసీపీ పార్టీపై బురద జల్లడానికి తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాన్ని వల్లభనేని వంశీ బయటపెట్టారు. స్వయంగా టీడీపీ ఆఫీస్ నుంచే 50 వెబ్ సైట్లు నడిచిన విషయాన్ని బయటపెట్టారు.…

సోషల్ మీడియాలో అభూతకల్పనల్ని సృష్టించడానికి, వైసీపీ పార్టీపై బురద జల్లడానికి తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాన్ని వల్లభనేని వంశీ బయటపెట్టారు. స్వయంగా టీడీపీ ఆఫీస్ నుంచే 50 వెబ్ సైట్లు నడిచిన విషయాన్ని బయటపెట్టారు. అది కూడా ఇంటలిజెన్స్ ఆధ్వర్యంలో నడిపారని వెల్లడించి మరో షాకిచ్చారు వంశీ.

“సోషల్ మీడియాలో నా మీద విచిత్రమైన రాతలు రాయడం మొదలుపెట్టారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఓసారి చంద్రబాబు, లోకేష్ ను అడిగారు. ఆయన ఖమ్మం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అని చెప్పారు. ఖమ్మం వ్యక్తికి నామీద నెగెటివ్ కామెంట్స్ రాయాల్సిన అవసరం ఏముంది? ఇదే విషయాన్ని ఇంటలిజెన్స్ వాళ్లను అడిగాను. టీడీపీ వాళ్లు 50 వెబ్ సైట్స్ నడుపుతున్నారని, అవి కూడా గతంలో ఉన్న ఇంటలిజెన్స్ పెద్దల ఆధ్వర్యంలోనే నడిచాయని చెప్పారు. ఓ 10వేల ఈమెయిల్స్ ను హైదరాబాద్ లోని ఓ ప్రముఖ టీడీపీ నేత ఇంటి నుంచే నడుపుతున్నారు. ఆ 50 వెబ్ సైట్ల వివరాలు, వాళ్ల అడ్రెస్ లు నాకిచ్చారు. అవి చూసి నాకు దిమ్మ తిరిగింది.”

ఇలా తనపై తెలుగుదేశం పార్టీలోకి కొంతమంది వ్యక్తులు బురద చల్లడానికి ప్రయత్నించారని వంశీ ఆరోపించారు. తన నియోజకవర్గ స్థాయి నుంచి ఇది జరగడం లేదని తెలుసుకున్న వంశీ.. పూర్తిస్థాయిలో కూపీ లాగిన తర్వాత… చంద్రబాబు కనుసన్నల్లో టీడీపీ ఆఫీస్ నుంచే రాష్ట్రస్థాయిలో ఈ బురదజల్లుడు కార్యక్రమం జరుగుతున్నట్టు తెలుసుకున్నానని అన్నారు.

“సోషల్ మీడియాలో పనిలేని వాళ్లు చాలామంది ఉంటారు. వాళ్ల రాతలు నేను పట్టించుకోను. కానీ నా మీద ఆర్గనైజ్డ్ గా ఇది జరిగింది. అది కూడా టీడీపీ ఆఫీస్ నుంచి జరిగింది. అందుకే బాధపడ్డాను. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ లాంటి హీరోలు పార్టీలోకి వస్తే, నాలాంటి వాడు ఎన్టీఆర్ కు మద్దతిస్తాడని భయపడి, ఇలా నాపై దుష్ర్పచారం చేశారు.”

ఎన్టీఆర్ కు మద్దతిచ్చే ఇతర టీడీపీ నేతల్ని కూడా చంద్రబాబు టార్గెట్ చేశారని, సోషల్ మీడియా సాయంలో వాళ్లను కూడా అప్రతిష్ఠ పాలు చేస్తారని అంటున్నారు వంశీ. తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు లోకేష్ కు లేవన్న వంశీ… ఎన్టీఆర్ కుటుంబంలో సమర్థులైన బాలయ్య, ఎన్టీఆర్ లో ఎవరో ఒకరు పగ్గాలు చేపట్టాలని కోరుకున్నారు. వాళ్లలో మాత్రమే ఫైర్ ఉందని, లోకేష్ లో లేదని అన్నారు.