అయోధ్య.. ఇంకా అయిపోలేదు!

అయోధ్య వివాదస్పద స్థలంపై సుప్రీం  కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తాము సంతృప్తిగా లేనట్టు ప్రకటించింది ముస్లిం పర్సనల్ లా బోర్డు. షరియా చట్టానికి భిన్నంగా సుప్రీం కోర్టు తీర్పు ఉందని ఆ వర్గాలు…

అయోధ్య వివాదస్పద స్థలంపై సుప్రీం  కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తాము సంతృప్తిగా లేనట్టు ప్రకటించింది ముస్లిం పర్సనల్ లా బోర్డు. షరియా చట్టానికి భిన్నంగా సుప్రీం కోర్టు తీర్పు ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ ను దాఖలు చేయబోతున్నట్టుగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది.

నెల రోజుల్లోపే ధర్మాసనం తీర్పుపై రివ్యూ పిటిషన్ ను  దాఖలు చేయబోతున్నట్టుగా తెలిపింది. ఈ నేపథ్యంలో అయోధ్య అంశం ఇంకా తేలిపోలేదని అనుకోవాల్సి వస్తోంది.

అయితే ఈ రివ్యూ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం మళ్లీ స్వీకరిస్తుందా? ఇప్పటికే దాదాపు తొమ్మిదేళ్ల పాటు సుప్రీం ధర్మాసనం ఈ కేసును విచారించింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ రివ్యూ పిటిషన్ ను విచారించాలంటే మరెంత కాలం పడుతుంది? అనేది సమాధానం లేని ప్రశ్నలే.

అయోధ్య తీర్పును మొదట ముస్లిం వర్గాలు స్వాగతించాయి. అయితే రాజకీయంగా ఈ వివాదం పరిష్కారం కావడం కొందరికి నచ్చడం లేదు. దీంతో మళ్లీ కథను  మొదటకు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే రివ్యూ పిటిషన్ ను ధర్మాసనం తిరస్కరించి, ఇటీవలి తీర్పుపై స్టే విధించకపోతే.. మాత్రం కథ ముగిసినట్టే.