పక్కా కామెడీ సినిమాలు తీసుకుంటూ హాయిగా వున్న డైరక్టర్ శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా ఢమరుకం అనే ఫాంటసీ సినిమాను భారీ రేంజ్ లో తలకెత్తుకున్నారు. సబ్జెక్ట్ సరైనదైనా, స్క్రిప్ట్ దగ్గర తేడా కొట్టేసింది. కాస్టింగ్ లో కూడా కొంత సమస్య ఎదురైంది. మొత్తానికి ఢమరుకం సినిమా సరైన సౌండ్ చేయలేదు.
కాస్త విరామం తరువాత మళ్లీ శ్రీనివాసరెడ్డి సినిమా అందిస్తున్నారు. ఈసారి కూడా ఆయన తన కామెడీ జోనర్ లోకి వెళ్లలేదు. థ్రిల్లర్ ను ట్రయ్ చేస్తున్నారు. ప్రేక్షకులు ఈ మధ్య ఎక్కువగా థ్రిల్లర్ లను లైక్ చేస్తున్నారు కాబట్టి, శ్రీనివాసరెడ్డి ఆ దోవలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
సత్య-ఈషారెబ్బా కాంబినేషన్ లో ఓ మర్డర్ మిస్టరీని థ్రిల్లర్ గా రూపొందించారు. న్యూ ఏజ్ థ్రిల్లర్లు చూడడం అలవాటు పడిన ఈ జనరేషన్ టేస్ట్ కు మ్యాచ్ అయ్యేలా శ్రీనివాసరెడ్డి తన సినిమాను అందించినట్లే కనిపిస్తోంది ట్రయిలర్ చూస్తుంటే. ప్రేక్షకుల అంచనా అందుకునేలా వుంది.
ఈ థ్రిల్లర్ తో హిట్ కొట్టడమే కాదు, సరైన కామెడీ సినిమాలు లేని లోటు పూడ్చే బాధ్యత కూడా శ్రీనివాస రెడ్డి తీసుకోవాలి.