శ్రీలీల తరువాత నేనే.. అంటూ తనకు కూడా అదే రేంజ్లో కాకున్నా కాస్త అటు ఇటుగా అదే రెమ్యూనిరేషన్ కావాలంటోందట ఓ హీరోయిన్. చిట్టి సినిమాల నుంచి మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు సర్రున దూసుకువచ్చింది. చేసిన క్యారెక్టర్ కు అలా ఫిట్ అయిపోయింది.
సినిమా హిట్టయిపోయింది. సినిమా ఎందుకు హిట్ అయింది. దానికి ఏయే కారణాలు వున్నాయి. ఏయే సీన్లు దోహదం చేసాయి, అన్నవి అన్నీ మరిచిపోయి, ఇప్పుడు ఎవరు కథ చెబుతామన్నా, అసలు ఎంత ఇస్తారు అనే పాయింట్‌ను మందుగా డిస్కస్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కోటికి కాస్త అటు ఇటుగా రెమ్యూనిరేషన్ వుంటేనే చేస్తాననే మాట వినిపిస్తోందట. పైగా ఫలానా హీరోయిన్‌కు వున్న హిట్ ఒక్కటే. ఆ హీరోయిన్‌కు ఇంత ఇస్తున్నారు.. అనే కంపారిజన్లు కూడా వినిపిస్తున్నాయట.
కానీ అన్ని తరహా పాత్రలకు సెట్ కావాల్సి వుండడం, డ్యాన్స్ లు పాటలు, ఇంకా చాలా చాలా విషయాలు అవసరం హీరోయిన్ కు. అవన్నీ వదిలేసి, జస్ట్ హిట్ మాత్రమే పట్టుకుని ఇంత డిమాండ్ ఏమిటి అని చెవులు గట్రా కొరుక్కుంటున్నారట సినిమా జనాలు.
ఇదిలా వుంటే ఆమెతో మరో రెండు సినిమాలకు ఆల్రెడీ సిద్దపడి వున్నవారు మాత్రం, ఇప్పుడు తమను కూడా ఎంత అడుగుతుందో చూడాలి అని లెక్కలు వేసుకుంటున్నారట.