‘తెలుగు’ మీడియాకు జోహార్లు

తెలుగు మీడియా అంటే తెలుగుదేశం అను’కుల’ మీడియా. ఈ మీడియా తెలివితేటల ముందు.. ప్రచారం ముందు.. ప్రపంచంలో మరెవరైనా బలాదూరే. వాళ్ల స్ట్రాటజీలు, వాళ్ల ఎత్తుగడలు, వాళ్ల ప్రచారం.. అబ్బో.. అదో లెవెల్. ఆ…

తెలుగు మీడియా అంటే తెలుగుదేశం అను’కుల’ మీడియా. ఈ మీడియా తెలివితేటల ముందు.. ప్రచారం ముందు.. ప్రపంచంలో మరెవరైనా బలాదూరే. వాళ్ల స్ట్రాటజీలు, వాళ్ల ఎత్తుగడలు, వాళ్ల ప్రచారం.. అబ్బో.. అదో లెవెల్. ఆ మీడియాను అలా నిత్యం ఫాలో అవుతూ, వాళ్ల ఎత్తుగడలు పరిశీలిస్తూ వుండాలి. అప్పుడు వాటి కట్టుకథలు నమ్మడం మానేసే అవకాశం వుంటుంది.

గత నాలుగేళ్లలో ఏ తరహా ఎత్తుగడలు వేసారో ఓసారి చూద్దాం.

ముందుగా రాష్ట్రం అధోగతి పాలు అవుతోంది. జగన్ అప్పులు చేసేస్తున్నాడు. జనాలకు పంచేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. ఇంకా.. ఇంకా.. ఇంకా.

కానీ దీని వల్ల ఏం జరిగింది? ఏం జరగలేదు?

పట్టణ ఓటరు కొంత వరకు ప్రభావితం అయ్యాడు. జగన్ నిజంగానే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తున్నాడు అని కొంత వరకు నమ్మాడు. కానీ ఎవరైతే పథకాలు అందుకుంటున్నారో వాళ్లు మాత్రం జగన్ వెంట వున్నారు. పైగా ఎన్నికలు వస్తున్నాయి. తాము కూడా హామీలు ఇవ్వాలి. పైగా జగన్ పథకాలను మించి ఇవ్వాలి. అదెలా?

అందుకే ఇప్పుడు ట్యూన్ మార్చారు. జగన్ పథకాలు అన్నీ డొల్ల. ఆ స్కీములో ఇదీ నష్టం.. ఈ స్కీములో ఇదీ మర్మం.. ఆ స్టేట్ లో ఇంత ఇస్తున్నారు. ఇక్కడ తక్కువ ఇస్తున్నారు. ఇవీ ఇఫ్పుడు రాతలు.

మరి ఆ స్టేట్‌లో ఎక్కువ ఇస్తున్నారు. ఇక్కడ తక్కువ ఇస్తున్నారు అనే రాసేవాళ్లు, అలా ఇచ్చేస్తుంటే రాష్ట్రం మరింత అప్పుల పాలు కాదా? అన్నది కూడా చెప్పాలి కదా? అప్పుడు శ్రీలంక అయిపోదా?

అంటే ఇక్కడ స్ట్రాటజీ ఏమిటి?

రాష్ట్రం.. ఎకానమీ.. అభివృద్ధి అంటూ అర్బన్ ఓటర్లను జగన్‌కు దూరం చేసే ప్రయత్నం యధాశక్తి చేసేసాం.

ఇప్పుడు ఇస్తున్న స్కీములు అంతా కనికట్టు. మాయ. మీకు ఒరుగుతున్నది ఏమీ లేదు అంటూ రూరల్ ఓటర్లను మాయ చేయాలి.

అబ్బబ్బ.. ఏం చేస్తిరి.. ఏం చేస్తిరి.. అందుకే ఈ ‘తెలుగు’ మీడియా తెలివితేటలు, ఎత్తుగడలు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్.