Advertisement

Advertisement


Home > Politics - Gossip

మూడు నెలలు 'వారాహి'కి విశ్రాంతి!

మూడు నెలలు 'వారాహి'కి విశ్రాంతి!

తూర్పుగోదావరి.. పశ్చిమ గోదావరి జిల్లాల్లో సెలెక్టివ్ ప్లేస్‌లు తిరిగి వారాహి అలసిపోయింది. ప్రస్తుతం గ్యారేజ్‌లో విశ్రాంతి తీసుకుంటోంది.

వారిహిని అధిరోహించి పర్యటించే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా విశ్రాంతి మోడ్ లో వున్నారు. విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చారు. రెండు రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇకపైన మళ్లీ ఛలో వారాహి అంటారేమో అంటే.. కానే కాదు. మరో మూడు నెలల వరకు రాజకీయ వారాహి పర్యటనలు వుండవని తెలుస్తోంది.

ఈ నెలలో రెండు వారాల పాటు ఓ సినిమాకు, వచ్చే నెలలో రెండు వారాల పాటు మరో సినిమాకు డేట్‌లు కేటాయించేసారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రలో తెలుగుదేశం యువనేత లోకేష్ పర్యటన సాగుతోంది. వెస్ట్ లో వున్నారు. ఈస్ట్, ఉత్తరాంధ్ర వెళ్లాలి. సో అందువల్ల ఇక పవన్ బాబు అటు వెళ్లే అవకాశం లేదు.. అవసరమూ లేదు. 

లేదూ అదే టైమ్‌లో కృష్ణ, గుంటూరు జిల్లాలు తిరిగినా కష్టమే. ఎందుకుంటే పవన్ యాత్ర ముందు చినబాబు టూర్ చినబోకూడదు కదా. అందువల్ల ఇప్పుడు పవన్ బాబు టూర్ ప్లాన్ లు ఏవీ చేయకూడదు.

అలా చేయాలనుకుంటే లోకేష్ వెళ్లి వచ్చేసిన రాయలసీమకు వెళ్లాల్సిందే. కానీ నిజానికి పవన్ విశాఖ వరకు వెళ్లి వచ్చేసారు. అటు నుంచి అటు శ్రీకాకుళం వరకు వెళ్లాలి. కానీ ఇప్పుడు లోకేష్ యాత్ర అడ్డం పడింది. అందుకే ఈ టైమ్ లో సినిమా షూట్‌లు పెట్టుకున్నారు. ఈ నెల, వచ్చే నెల సినిమా షూట్‌లు చేస్తారు. డిసెంబర్ నాటికి లోకేష్ యాత్ర అయిపోతే అప్పుడు మళ్లీ ఛలో వారాహి అంటారేమో?

అప్పటి వరకు మధ్య మధ్యలో శని, ఆదివారాలు మంగళగిరి టూర్‌లు, మీటింగ్ లు వుండొచ్చు. రెడీ మేడ్ ట్రంప్లెట్ లెటెర్ హెడ్ మీద ప్రెస్ నోట్ లు వుండొచ్చు. అంత వరకు గ్యారంటీ వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?