వల్లభనేని వంశీ… వారందరికీ మార్గదర్శి!

వల్లభనేని వంశీ, నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే! ఇప్పుడు ఆయన పార్టీ నుంచి వెలుపలికి వచ్చారు. పార్టీకి ముందుగానే రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. మొత్తానికి…

వల్లభనేని వంశీ, నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే! ఇప్పుడు ఆయన పార్టీ నుంచి వెలుపలికి వచ్చారు. పార్టీకి ముందుగానే రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. మొత్తానికి తెలుగుదేశంతో అనుబంధం తెగింది. పార్టీ సస్పెండ్ చేసింది కనుక, ఆయనను స్వతంత్ర ఎమ్మెల్యేగా సభలో గుర్తిస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.

ఇంతవరకు ఈ సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, ఈ సంగతి ఆధారంగా… భవిష్యత్తులో చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీని వీడి వెలుపలికి వెళ్తారని కొంతమంది మాత్రమే అంచనా వేయగలుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏమిటో… 2024 ఎన్నికల నాటికి ఆ పార్టీ ఎలా ఉంటుందో… ఏమో తెలియక భయాందోళనలో చాలామంది నాయకులు కొట్టుమిట్టాడుతున్నారు.

ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయి తమ భవిష్యత్తు కాపాడుకోవాలనే అనుకుంటున్నారు. అయితే పార్టీ ఫిరాయింపు చేస్తే అనర్హత వేటు పడుతుంది అని స్పీకర్ తమ్మినేని సీతారాం గట్టిగా హెచ్చరిస్తుండడం వలన అదే పార్టీలో కొనసాగుతున్నారు. అలాంటి వారందరికీ వంశీ వ్యవహారం మార్గదర్శకంగా మారుతున్నది.

తెలుగుదేశం పార్టీని వీడి పరుచుకున్న ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే వాళ్లు అనుసరించవలసిన విధానం ఇదీ

ముందుగా పార్టీకి రాజీనామా చేయాలి ఆ రాజీనామాను పార్టీ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా విస్మరించాలి.

ఆ తర్వాత కొన్ని రోజులకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వ్యవహార సరళి మీద విమర్శలు గుప్పించాలి.

మరొక పార్టీకి మద్దతుగా ఉండబోతున్నాం అంటూ ఒక బహిరంగ ప్రకటన చేయాలి.

ఆ తర్వాత పార్టీ అధిష్టానం వారిని సస్పెండ్ చేస్తుంది.కొత్త పార్టీలో ‘జాయిన్’ కాకుండా వారికి మద్దతు ఇస్తాం.. అంటూ వారితో రాసుకు పూసుకు తిరుగుతూ ఉంటే చాలు. ఎటూ సస్పెండయ్యారు గనుక,

వారిని శాసనసభ స్పీకర్ స్వతంత్ర ఎమ్మెల్యే గా మాత్రమే గుర్తిస్తారు! వ్యవహారంలో కొత్త పార్టీ నాయకుడిగా చెలామణి కావచ్చు. కానీ పార్టీ సభ్యత్వం తీసుకోకూడదు. అలా చేసినట్లయితే, ఆ పార్టీలతో అంటకాగుతూ స్వతంత్ర సభ్యుడుగా గుర్తింపు పొందుతూ పదవి కోల్పోకుండా మనగలగడం సాధ్యం అవుతుంది.

వల్లభనేని వంశీ సిద్ధాంతం సమకాలీన రాజకీయ నాయకులకు తెలుగుదేశం పార్టీని విడిచిపోదలుచుకుంటున్న ఎమ్మెల్యేలకు చేస్తున్న మార్గదర్శనం ఇది!!