హారిక హాసిని లో ఐటి సోదాలు!

ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ హారిక హాసిని సంస్థలో ఐటి సోదాలు జ‌రుగుతున్నట్లు బోగట్టా. ఈ ఉదయాన్నే ఐటి బృందాలు టాలీవుడ్ టార్గెట్ గా బయల్దేరాయని వార్తలు వినిపించాయి. దాంతో జ‌నాల అందరి దృష్టి…

ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ హారిక హాసిని సంస్థలో ఐటి సోదాలు జ‌రుగుతున్నట్లు బోగట్టా. ఈ ఉదయాన్నే ఐటి బృందాలు టాలీవుడ్ టార్గెట్ గా బయల్దేరాయని వార్తలు వినిపించాయి. దాంతో జ‌నాల అందరి దృష్టి మైత్రీ మీదకు వెళ్లింది. 

ఎందుకంటే లేటెస్ట్ గా రెండు భారీ సినిమాలు, భారీ కలెక్షన్లు బయటకు రావడంతో అందరూ అలా అనుకున్నారు. కానీ ఏ హడావుడి లేని హారిక హాసిని, సితార సంస్థలు, వాటి అధినేతలు చినబాబు, నాగవంశీల మీదకు వస్తారని ఎవ్వరూ ఊహించలేదు. 

ఎందుకంటే ప్రస్తుతం హారిక హాసిని నుంచి సినిమా ఏదీ రెడీగా లేదు. మహేష్ బాబు సినిమా షూట్ ఈ రోజే ప్రారంభం అయింది. సితార సినిమాలు అన్నీ చిన్న చిన్నవే.

గతంలో ఓ సారి హారిక మీద ఐటి రెయిడ్స్ జ‌రిగాయి. కానీ ఏమీ సమస్య కాలేదు. ఇది రెండో సారి. ఉదయాన్నే సారథి స్టూడియోస్ కు చేరుకున్న కొందరు ఐటి అధికారులు, అక్కడ వున్న నాగవంశీని తీసుకుని భూజా గేటెడ్ కమ్యూనిటీలో వున్న అతని ఇంటికి వెళ్లినట్లు బోగట్టా. అలాగే హారిక హసిని సంస్థకు కొంతమంది వెళ్లినట్లు తెలుస్తోంది. 

మైహోమ్ సంస్థతో సినిమా నిర్మాణ సంబంధాలు వున్నాయి. అలాగే ఫీనిక్స్ సంస్థతో బాంధవ్యాలు వున్నాయి. వీటి నేపథ్యంలో ఈ సోదాలు జ‌రుగుతున్నాయా? లేక రొటీన్ నా అన్నది తెలియాల్సి వుంది.

ప్రస్తుతం అందరి ఫోన్ లో స్విచాఫ్ లో వున్నాయి. ఏ విషయం సాయంత్రానికి కానీ వెల్లడి కాకపోవచ్చు.