హీరో మంచు మనోజ్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనపడుతుంటారు. తాజాగా మంచు మనోజ్ ఓ స్పెషల్ న్యూస్ అంటూ ట్వీట్ చేశారు.
మంచు మనోజ్ ట్వీట్టర్ లో .. 'నేను జీవితంలో నెక్ట్స్ ఫేజ్ లోకి అడుగుపెట్టబోతున్నానంటూ.. చాలా రోజులుగా నా మనసులో దాచుకుంటూ వస్తోన్న ఓ స్పెషల్ న్యూస్‌ను జనవరి 20న మీ అందరితో పంచుకోనున్నట్లు' ట్వీట్ చేశారు.
బహుశా ఈ నెల 20న తమ ప్రేమ వివాహం గురించి చెప్పబోతున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే పెళ్లిపై క్లారిటి ఇచ్చిన మంచు మనోజ్ 20న పెళ్లి తేదిని ప్రకటించబోతున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. గత కొంత కాలంగా మంచు మనోజ్- భూమా మౌనిక కలిసి ఉంటున్నారు.
ఇప్పటికే మంచు మనోజ్ పెళ్లి అయి విడాకులు తీసుకున్నారు. అలాగే మౌనికకు కూడా పెళ్లి జరిగి విడాకులు తీసుకున్నది తెలిసిందే.