ఇంట్లో డాక్టర్లు ఎక్కువ అయితే, ప్రిస్కిప్షన్లు కూడా ఎక్కువ అవుతాయేమో? అక్కినేని-రామానాయుడు ఫ్యామిలీల్లో సినిమా పరిజ్ఞానం వున్నవాళ్లు ఎక్కువ. అక్కడితే ఆగిపోతే సరిపోయేది. కానీ నాగ్, సమంత, రానా, సురేష్ బాబు లాంటి వాళ్లు సినిమాలను ఫైనల్ చక్కదిద్దడంలో కీలకంగా వ్యవహరించే అలవాటు వున్నవాళ్లు.
చైతన్య సినిమాలను సమంత చాలా కీలకంగా చూస్తారు. శైలజ రెడ్డి అల్లుడు, మజిలీ సినిమాల విషయంలో సమంత చాలా కీలకంగా వ్యవహరించినట్లు వార్తలు వున్నాయి. ఇక వెంకటేష్ సినిమాలను సోదరుడు సురేష్ బాబు ఓ లెక్కన బయటకు వదలరు.
స్క్రిప్ట్ దగ్గర నుంచి విడుదల వరకు సినిమాను ఫైన్ ట్యూన్ పై ఫైన్ ట్యూన్ చేస్తూనే వుంటారు.ఇప్పుడు కొత్తగా అక్కడ రానా కూడా తోడయ్యారు. సురేష్ బాబు తో కనెక్షన్ వున్న సినిమాల మీద రానా కూడా ఓ కన్ను వేసే వుంచుతారు.
ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో వెంకీమామ సినిమా వస్తోంది. ఇటు చైతన్య వున్నారు. అటు వెంకీ వున్నారు. దాంతో ఇటు సమంత- అటు రానా ఈ సినిమా మీద వీర కేర్ తీసుకుంటున్నారట. సినిమాకు దిద్దుబాట్లు, ఫైన్ ట్యూన్ లు వీళ్లు అలా చేస్తూనే వస్తున్నారని బోగట్టా.
ఆ సినిమాకు పని చేసిన ఓ కీలక టెక్నీషియన్ నుంచి వచ్చిన సమాచారం ఇది. అందువల్ల నమ్మక తప్పదుగా.ఇదిలా వుంటే ఇప్పటికి రెండు పాటలు బయటకు వదిలారు కానీ, ఒక్కటీ పెద్దగా ఆకట్టుకునేలా లేవు. ధమన్ సంగీతం త్రివిక్రమ్ దగ్గర తప్ప వేరే వాళ్ల దగ్గర సరిగ్గా పలకదేమో?