Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సైరా..లాసాయెరా

సైరా..లాసాయెరా

సంచి లాభం చిల్లి కూడదీయడం అని వెనకటికి సామెత వుంది. మెగాస్టార్ మెగా మూవీ సైరా సినిమాను తెలుగు నాట మంచి రేట్లకు అమ్మారు. బయ్యర్లు లాభం చేసుకోకపోయినా, నిర్మాతగా రామ్ చరణ్ లాభం చేసుకున్నారు. కానీ ఆ లాభం కాస్తా నాన్ తెలుగు ఏరియాల్లో హుష్ కాకి అయిపోయిందని తెలుస్తోంది.

తమిళ, మలయాళ వెర్షన్ల సంగతి ఎలా వున్నా, బాలీవుడ్ లో గట్టి దెబ్బ తగిలిందని తెలుస్తోంది. బాలీవుడ్ లో సైరా స్వంత విడుదల చేసుకున్నారు. అక్కడ వచ్చిన షేర్ కన్నా విడుదలకు అయిన ఖర్చులు చాలా అంటే చాలా ఎక్కువ. అందువల్ల ఇప్పుడు బాలీవుడ్ వెర్షన్ వల్ల దాదాపు పది కోట్ల వరకు సైరా నిర్మాత రామ్ చరణ్ కు వెనక్కు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని గ్యాసిప్ వినిపిస్తోంది.

మలయాళ, తమిళ వెర్షన్లలో లాభం రాలేదు. కర్ణాటక, ఓవర్ సీస్ బయ్యర్లు కుదేలయ్యారు.  తెలుగునాట బయ్యర్లు అంతంత మాత్రం నష్టాలతో బయట పడ్డారు. వీరందరికీ జీఎస్టీలు కట్టడం అనే ఆనవాయతీ వుంది. ఇవన్నీ కలిసి సైరా నిర్మాత రామ్ చరణ్ కలిసి కాస్త భారీ ఖర్చునే తెచ్చిపెట్టేలా వున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?