నోటికి ఎంత మాటొస్తే అంత, ఏది పడితే అది మాట్లాడ్డంలో జేసీ బ్రదర్స్ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పేరు పొందారు. వైసీపీ అధినేత జగన్‌ను ఆయన సామాజిక వర్గానికి చెందిన జేసీ బ్రదర్స్‌తో తిట్టించడంలో చంద్రబాబునాయుడు సక్సెస్ అయ్యారు. అయితే పదేపదే జగన్‌ను అనరాని మాటలు అనడం ద్వారా జేసీ బ్రదర్స్ రాజకీయంగా ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు మెప్పు కోసం జగన్‌పై జేసీ బ్రదర్స్ అవాకులు చెవాకులు పేలడాన్ని ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూ….అదును చూసి వాత పెట్టారు. దీంతో జేసీ బ్రదర్స్ తనయుడు మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఇటీవల ట్రావెల్స్ కుంభకోణంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి రెండు నెలలకు పైగానే కడప సెంట్రల్ జైల్లో గడిపారు. అనంతరం జైలు నుంచి విడుదలై ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో దళిత సీఐని దూషించారనే అభియోగంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి జైలుపాలయ్యాడు. జైల్లో కరోనా బారినపడ్డ ప్రభాకర్‌రెడ్డికి అనంతపురం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చికిత్స నిమిత్తం ఆయన హైదరాబాద్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా టీడీపీలోనూ, తన మనసులోనూ జేసీ బ్రదర్స్ స్థానం ఏంటో చంద్రబాబు పరోక్షంగా తేల్చి చెప్పారు. అదెలాగంటే … చాలా రోజుల తర్వాత హైదరాబాద్ విడిచి చంద్రబాబు ఆంధ్రాకు వస్తున్నారు. ఈ వేళ మధ్యాహ్నం ఒంటి గంటకు తన ఇంటి నుంచి బయల్దేరి ఐదు గంటలకు ఉండవల్లిలోని తన ఇంటికి బాబు చేరుకుంటారని టీడీపీ వర్గాలు చెప్పాయి. బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను గురువారం ఆయన పరామర్శించనున్నారు. ఓకే గుడ్.
పార్టీ అధినేతగా కష్టాల్లో ఉన్న నేతలను పరామర్శించి ధైర్యం చెప్పడం ద్వారా ఇతర నాయకులకు కూడా ఓ భరోసా కల్పించినట్టవుతుంది. అయితే జేసీ ప్రభాకర్‌రెడ్డి విషయంలో అలా ఎందుకు చేయలేదని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. తమ నాయకుడు ఏకంగా రెండుసార్లు జైలుపాలయ్యాడని, మొదటి సారి అరెస్ట్ అయినప్పుడు లోకేశ్ వచ్చి పరామర్శించారని జేసీ అనుచరులు గుర్తు చేస్తున్నారు.
అంటే జేసీ బ్రదర్స్ స్థాయి… లోకేశ్ స్థాయా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, రెడ్డి సామాజిక వర్గం కావడంతో జేసీ బ్రదర్స్‌ను పరామర్శించడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని చంద్రబాబు భావించడం వల్లే…ఫోన్లో తప్ప ప్రత్యక్షంగా తాడిపత్రికి చంద్రబాబు రాలేదని జేసీ అనుచరులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమ నాయకులు జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలకు జ్ఞానోదయం కావాలని, తమ స్థాయి ఏంటో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను పరామర్శించనున్న చంద్రబాబు పరోక్షంగా తేల్చి చెప్పినట్టైందని జేసీ అనుచరులు అంటున్నారు.
నిజం నిలకడ మీద తేలుతుందంటారు. నిజంగా జేసీ బ్రదర్స్‌పై చంద్రబాబుకు ప్రేమే ఉంటే…రెండుసార్లు అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు చంద్రబాబే నేరుగా తాడిపత్రి వెళ్లి ఉండాల్సింది. ఇదే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలు బీసీలు కావడంతో…వారిని పరామర్శించి కుల రాజకీయాలు చేయడానికి ఇదే సరైన సమయమని చంద్రబాబు ఆంధ్రాకు వస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
విజయవాడలో కోవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి పది మంది చనిపోయినా చలించని చంద్రబాబు…కుల రాజకీయాలు చేయడానికి మాత్రం ముందుంటారనేందుకు ఇదే నిదర్శనం.