యధా మోడీ..తథా పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను చూస్తే ఒక్కోసారి అయ్యో అనిపిస్తుంది. ఆయన స్టేచర్ ఏమిటి? ఆయనకు వున్న ఫాలోయింగ్ ఏమిటి? ఆయన సినిమాలు చేస్తే వచ్చే క్రేజ్ ఏమిటి? ఇవన్నీ వదిలేసి, ఏవేవో,…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను చూస్తే ఒక్కోసారి అయ్యో అనిపిస్తుంది. ఆయన స్టేచర్ ఏమిటి? ఆయనకు వున్న ఫాలోయింగ్ ఏమిటి? ఆయన సినిమాలు చేస్తే వచ్చే క్రేజ్ ఏమిటి? ఇవన్నీ వదిలేసి, ఏవేవో, ఎందుకో, ఏమిటో అన్నట్లు చేస్తుంటారు. అలా చేసి కూడా పాపం, ఆయన సీరియస్ గా చేసినా కూడా డ్రామా చేసినట్లుగా దొరికిపోతుంటారు. 

భాజపాలో చేరిన తరువాత నుంచి ఆయనకు హిందూత్వం మీద గాలి మళ్లింది. అంతకు ముందు ఆయన తనకు తాను నక్సలైట్ లా ఫీలయ్యేవారు. ఈ రెండు సిద్దాంతాలకు చుక్కెదురు అన్న సంగతి తెలిసిందే. చిరకాలంగా ఆయన చాతుర్మాస దీక్ష పాటిస్తున్నా, ఈసారి ఆ దీక్షకు బాగా ప్రచారం వచ్చేలా చూసుకున్నారు.

తను హిందూ సనాతన ధర్మాన్ని తూ చ తప్పకుండా పాటిస్తాను అన్నట్లుగా ప్రవర్తిస్తూ కనిపించారు. కాషాయం లేదా తెల్లటి పంచె లాల్చీలు, గుబురు గెడ్డం అంతా ఓ సాధువు, సన్యాసి వేషం లో కనిపిస్తూ వస్తున్నారు. 

ఉత్తరప్రదేశ్ కు యోగి ముఖ్యమంత్రి అయ్యారని అదే బాటలో పయనించాలని పవన్ చూస్తున్నారని కామెంట్లు వినిపించాయి. ఇదిలా వుంటే ఈ రోజు ఉన్నట్లుండి భంగిమ వన్..భంగిమ టూ అనేలా ఇరవై ఫొటోలను మీడియాకు వదిలారు.

పవన్ సర్వసంగ పరిత్యాగిలా తన తోటలో, చెట్టుకింద ఓ చాప వేసుకుని కూర్చున్నట్లు, చెట్టుకింద కుర్చీ వేసుకుని, బోలెడు పైల్స్ పక్కన పెట్టుకుని ఆఫీసు పని చేస్తున్నట్లు, తులసి మొక్కను తదేక దీక్షతో చూస్తున్నట్లు ఇలా..రకరకాలుగా.

ఇటీవలే ప్రధాని మోడీ ఫొటోలు కొన్ని వచ్చాయి. చెట్టుకింద కూర్చుని ఇటు పుస్తకాలు, అటు లాప్ టాప్, చేతిలో పత్రికతో, అలాగే తను ఆఫీసు పని చేస్తుండగా పక్కనే నెమలి, ఇలాంటి ఫోటోలు. ఇప్పుడు పవన్ ఫొటోలు చూస్తుంటే అవే ఇక్కడా ఇన్సిపిరేషన్ అనిపిస్తుంది.

సినిమా వాళ్లకు రీమేక్, లేదా ఇన్ స్పయిర్ కావడం అన్నది కామన్. పవన్ ఎంత రాజకీయ వేత్త అయినా ఆయన కూడా సినిమా మనిషే కదా. అందుకే ఇలా అయి వుంటుంది అనుకోవాలి.

Click Here For Photo Gallery

చంద్ర‌బాబు@25