మెగా సినిమా కు మహతి స్వరసాగర్

ఛలో, భీష్మ సినిమాలతో తనేంటో నిరూపించుకున్నాడు మహతి స్వరసాగర్. సంగీత దర్శకుడు మణిశర్మ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, మెలమెల్లగా తనకంటూ ఓ ఇమేజ్ ను తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కు మణిశర్మ…

ఛలో, భీష్మ సినిమాలతో తనేంటో నిరూపించుకున్నాడు మహతి స్వరసాగర్. సంగీత దర్శకుడు మణిశర్మ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, మెలమెల్లగా తనకంటూ ఓ ఇమేజ్ ను తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కు మణిశర్మ ఇచ్చిన సూపర్ మాస్ మ్యూజిక్ వెనుక మహతి కూడా వున్నారని టాక్ వుంది. అదెంత వరకు నిజం అన్నది పక్కన పెడితే, ఇప్పుడు మాంచి చాన్స్ మహతిని వెదుక్కుంటూ వచ్చినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్-మెహర్ రమేష్ కాంబినేషన్ లో తయారయ్యే వేదాలం రీమేక్ కు మహతి సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ మీద మెహర్ సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు. సినిమా ఇప్పట్లో మొదలయ్యేది లేదు కానీ, మిగిలిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా జరుగుతోంది. ఇప్పటికే మహతి స్వరసాగర్ ఓ ట్యూన్ చేసారని, దానిని మెగాస్టార్ కు వినిపించడానికి మెహర్ స్వయంగా బెంగళూరు బయల్దేరి వెళ్లారని తెలుస్తోంది.

దేవీశ్రీ  ఇలాగే మెలమెల్లగా సినిమాలు చేస్తున్న టైమ్ లో శంకర్ దాదా సినిమా ఇచ్చారు మెగాస్టార్. ఆ తరువాత ఓ రేంజ్ కు వెళ్లాడు ఆయన. ఇప్పుడు మహతి కూడా ఓ రేంజ్ కు వెళ్తారేమో?

ఆ మగాడు వస్తాడా? ఈ మగాడితోనే రాజీకొస్తారా?

చంద్ర‌బాబు@25