కలర్‌ఫుల్ హీరోయిన్‌గా, చలాకీ పిల్లగా టాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచుకున్న అందమైన భామ స్వాతి. ఆమె అసలు పేరు కంటే కొసరు పేరుతోనే పాపులర్ అయ్యారామె. ఆ అందాల తారే కలర్స్ స్వాతి. కలర్స్ ప్రోగ్రామ్‌లో తన చిలిపి చేష్టలు, చలాకీతనంతో అందరినీ ఆకట్టుకున్న హీరోయిన్‌గా స్వాతి గుర్తింపు పొందారు.
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల్ని కనువిందు చేసేందుకు సరికొత్తగా తనను తాను స్వాతి ఆవిష్కరించు కోనున్నట్టు టాలీవుడ్ టాక్. తెలుగులో స్వాతి చిట్ట చివరి చిత్రం లండన్ బాబులు. ఆ తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. దీంతో స్వాతి మనసు టాలీవుడ్‌పై మళ్లిందనే వార్తలు ఫిలింనగర్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.
లాక్‌డౌన్‌లో థియేటర్ల మూసివేత నేపథ్యంలో ఓటీటీ ప్లాట్ ఫాంలకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. దీంతో తనను తాను కొత్తగా, వినూత్నంగా ఆవిష్కరించుకునేందుకు ఓటీటీ ప్లాట్ ఫాం సరైన వేదికగా స్వాతి భావిస్తున్నారని సమాచారం. ఇందు కోసం వెబ్ సిరీస్ చేసేందుకు ఆ అందాల తార రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇక తన రీఎంట్రీపై స్వాతి తన ఆణిముత్యాల్లాంటి మాటలతో చెబితే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు. కానీ ఆమె రాక కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారనేది నిజం.