చెక్కు చెక్కేసిన కమెడియన్?

జబర్దస్త్ టీమ్ లో పారితోషికాలు ఎలా వుంటాయి అన్నది ఓ క్లారిటీ లేని వ్యవహారం. టీమ్ ను బట్టి, దాని పాపులారిటీని బట్టి బల్క్ అమౌంట్ వుంటుంది. టీమ్ లీడర్ దాన్ని తన టీమ్…

జబర్దస్త్ టీమ్ లో పారితోషికాలు ఎలా వుంటాయి అన్నది ఓ క్లారిటీ లేని వ్యవహారం. టీమ్ ను బట్టి, దాని పాపులారిటీని బట్టి బల్క్ అమౌంట్ వుంటుంది. టీమ్ లీడర్ దాన్ని తన టీమ్ కు రకరకాలుగా పంచడం అన్నది కామన్. టీమ్ మెంబర్లకు సరిగ్గా డబ్బులు ఇవ్వడం ఇవ్వకపోవడం మీద జబర్దస్త్ స్కిట్ ల్లో కూడా అనేకసార్లు జోకులు పేల్చుకున్నారు వాళ్లలో వాళ్లే.

ఇదిలా వుంటే ఈ మధ్య ఓ పాపులర్ కమెడియన్ జబర్దస్త్ ను  లోకి  పిలిచారు. అతగాడు తనకు సహాయంగా  మరో చిన్న కమెడియన్ ను రిక్వెస్ట్ చేసి మరీ  తీసుకున్నారట. కానీ తొలి ఎపిసోడ్ కు చెక్ రాగానే, 'బ్యాంకులో వేసాను, ఇఎమ్ఐ కు కట్ అయిపోయింది..సారీ,,మళ్లీ ఇస్తాను' అని చెప్పాడం. మళ్లీ మరో ఎపిసోడ్ కు కూడా ఇదే రిపీట్ అంట. ముచ్చటగా మూడోసారి ఇదే తంతు అంట.

దీంతో పాపం, ఆ చిన్న కమెడియన్ తెలుసున్న వాళ్ల దగ్గర ఈ ఉదంతం చెప్పి ఫీలవుతున్నాడట. అసలే కరోనా, పిలిచి మరీ చాన్స్ ఇచ్చాడు. ఎంతకొంత వస్తుంది అనుకుంటే ఇలా జరిగింది అని చెప్పి వాపోతున్నాడట. పోనీ ఓపెన్ గా ఇంటర్వ్యూ పెట్టి ఇలా జరిగింది అని చెప్పవచ్చుగా అని అడిగితే, అలా చెప్పి, ఇండస్ట్రీలో మళ్లీ షో లు చేయలేం, టీమ్ హెడ్స్ మనకు కూడా ఇలా చేస్తాడేమో అని జంకి చాన్స్ ఇవ్వరు.

అందువల్ల మౌనంగా వుండిపోవడమే అంటున్నాడట.జబర్దస్త్  షో కామెడీయే కానీ, అందులో తెరవెనుక ట్రాజెడీలు కూడా వున్నాయన్న మాట.

ఆ మగాడు వస్తాడా? ఈ మగాడితోనే రాజీకొస్తారా?