తెలుగు తెరపైకి మరో ఇద్దరు

రచయితలు, అసిస్టెంట్ డైరక్టర్లు, ఫుల్ లెంగ్త్ డైరక్టర్లుగా మారడం కొత్తకాదు. టాలీవుడ్ లో ఇదొక రెగ్యులర్ ప్రాసెస్. కథ, కథనం బాగుంటే కొత్తవాళ్లను ప్రోత్సహించడానికి చాలామంది హీరోలు రెడీగా ఉన్నారు. ఇదే కోవలో ఇప్పుడు…

రచయితలు, అసిస్టెంట్ డైరక్టర్లు, ఫుల్ లెంగ్త్ డైరక్టర్లుగా మారడం కొత్తకాదు. టాలీవుడ్ లో ఇదొక రెగ్యులర్ ప్రాసెస్. కథ, కథనం బాగుంటే కొత్తవాళ్లను ప్రోత్సహించడానికి చాలామంది హీరోలు రెడీగా ఉన్నారు. ఇదే కోవలో ఇప్పుడు మరో ఇద్దరు దర్శకులు తెరపైకి రాబోతున్నారు. అటు నాని, ఇటు నాగార్జున వాళ్లను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారు.

నాగార్జున కొత్త సినిమా వివరాలు బయటకొచ్చాయి. బంగార్రాజు కాకుండా ఓ కొత్త దర్శకుడ్ని తెరకు పరిచయం చేయబోతున్నాడు. గతంలో వంశీ పైడిపల్లి దగ్గర పనిచేసిన సోలమన్ అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా చేయబోతున్నాడు నాగ్. ఊపిరి, మహర్షి సినిమాలకు సోలమన్ కీలకంగా వ్యవహరించాడు. ఇప్పుడు నాగ్ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని స్వయంగా నాగ్ ప్రకటించాడు.

సోలమన్ తరహాలోనే మరో దర్శకుడు కూడా తెరపైకి రాబోతున్నాడు. అతడి పేరు శ్రీకాంత్. దర్శకుడు సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన శ్రీకాంత్, ఓ వినూత్నమైన కథ రాసుకున్నాడు. ప్రేమకథల్లోనే డిఫరెంట్ ట్విస్ట్ తో సాగే సినిమా ఇది. ఈ సినిమాను నానితో ప్లాన్ చేస్తున్నాడు. నాని ఈ సినిమాలో నటించేందుకు దాదాపు అంగీకరించాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.