‘ఇంటర్ ఫెయిల్ పవన్, తెలుగురాని లోకేష్..’ వాట్టే పంచ్!

'ఇంటర్ ఫెయిల్ పవన్, తెలుగురాని లోకేష్ లు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వద్దంటున్నారు..' ఇది ఏ రాజకీయ నేత వ్యాఖ్యో కాదు. ఒక ఆటో డ్రైవర్ కూతురు మాట. ఆ అమ్మాయి మాట…

'ఇంటర్ ఫెయిల్ పవన్, తెలుగురాని లోకేష్ లు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వద్దంటున్నారు..' ఇది ఏ రాజకీయ నేత వ్యాఖ్యో కాదు. ఒక ఆటో డ్రైవర్ కూతురు మాట. ఆ అమ్మాయి మాట ఇప్పుడు పవర్ పంచ్ గా మారుతూ  ఉంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులను వ్యతిరేకిస్తూ పవన్ కల్యాణ్, లోకేష్ చేస్తున్న ఉద్యమం సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఒక సబ్జెక్ట్ గా ఉంటుంది. అయితే ఇతర సబ్జెక్టులను మాత్రం ఇంగ్లిష్ లో బోధిస్తారు. దాని వల్ల పిల్లల్లో ఆంగ్లంపై అవగాహన పెరిగే అవకాశాలుంటాయి.

ఒకవైపు ఇంగ్లిష్ రాక తమ కెరీర్ లో ఎంత ఇబ్బంది పడింది ప్రతి ఒక్క తెలుగు మీడియంలో చదివిన వ్యక్తీ చెబుతాడు. ఇలాంటి నేపథ్యంలో కూడా ఆ నిర్ణయాన్ని జగన్ అమలు చేస్తున్నాడనే కసితో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. తెలుగుపై లేని పోని ప్రేమను ఒలకపోస్తూ ఉన్నారు!

తెలుగు భాష మనుగడకే దెబ్బ అని వారు వాపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒక అమ్మాయి పవన్ కల్యాణ్, లోకేష్ లకు గట్టి సమాధానం ఇచ్చింది. ఆ అమ్మాయి చెప్పిన మాట వందశాతం నిజం.

లోకేష్ కు తెలుగు రాదు, పవన్ కల్యాణ్ ఇంటర్ ఫెయిలయ్యాడు… వీళ్లు రాజకీయ నేతలుగా చలామణి అవుతూ అన్ని విషయాల గురించి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ అమ్మాయికి ఆ విషయం అర్థం అయ్యింది. కొందరు మూర్ఖులకు మాత్రం అర్థం కాకపోవచ్చు.